చెప్పరాదు చూపరాదు చిగిరించీ భావమెల్ల
(॥పల్లవి॥)
చెప్పరాదు చూపరాదు చిగిరించీ భావమెల్ల
తప్పని జవ్వనపు వసంతవేళో కాని
(॥చెప్ప॥)
అతనిసుద్దులు వింటే అంగ్లమెల్లఁ జెమరించె
రతి నాచిత్తపుమోహరసమోకాని
తతిఁ చేరుకొంటేను తనువెల్లాఁ బులకించె
అతనుబాణములకు ఆయమోకాని
(॥చెప్ప॥)
కందువలు దలఁచితే కన్నుల నీళ్లురాలీ
విందులయానందముల వెల్లులోకాని
చెఁదిన నీముద్దు చూచి జిగి గుండె జల్లురనీ
చందురువెన్నెలకుప్ప జారెనోకాని
(॥చెప్ప॥)
శ్రీవేంకటేశు గూడి నెలవి నవ్వులు చిందె
చేవదేర నాలోనిసిగ్గులోకాని
నీని జారినంతలోనే నీకు సంతసము నిండె
యేవిధానఁ దానే చనవిచ్చెనోకాని
(||pallavi||)
sĕpparādu sūbarādu sigiriṁchī bhāvamĕlla
tappani javvanabu vasaṁtaveḽo kāni
(||sĕppa||)
adanisuddulu viṁṭe aṁglamĕllam̐ jĕmariṁchĕ
radi nāsittabumoharasamogāni
tadim̐ serugŏṁṭenu tanuvĕllām̐ bulagiṁchĕ
adanubāṇamulagu āyamogāni
(||sĕppa||)
kaṁduvalu dalam̐side kannula nīḽlurālī
viṁdulayānaṁdamula vĕllulogāni
sĕm̐dina nīmuddu sūsi jigi guṁḍĕ jalluranī
saṁduruvĕnnĕlaguppa jārĕnogāni
(||sĕppa||)
śhrīveṁkaḍeśhu gūḍi nĕlavi navvulu siṁdĕ
sevadera nālonisiggulogāni
nīni jārinaṁtalone nīgu saṁtasamu niṁḍĕ
yevidhānam̐ dāne sanavichchĕnogāni