చెప్పరాదు చూపరాదు చెలియభావము నేఁడు
(॥పల్లవి॥)
చెప్పరాదు చూపరాదు చెలియభావము నేఁడు
వుప్పతిల్లుఁ జెమటతో నుస్సురనీనమ్మా
(॥॥)
చక్కఁదన మొకవంక జవ్వన మిదొకవంక
మొక్కలపుపతి మీఁది మోహ మొకవంక
వొక్కటొక్కటికిఁగా కువిద నివ్వెరగుతో
ముక్కుమీఁదివేలితోడ మోము వంచెనమ్మా
(॥॥)
చిత్తపు కోరికలతో సిగ్గరిభావముతోడ
పొత్తుల చెలులు చెప్పే బుద్దులతోడ
యెత్తిన తమకమున నెదురు మాఁటాడలేక
తత్తరానఁ దనలోన తానే నవ్వీనమ్మా
(॥॥)
కన్నులఁ గావులు దేరె కళలు మోమునఁ దేరె
తిన్నని కెమ్మోవినెల్లా తేనేలు గారె
వెన్నెలవంటివలపు వేడుకఁ దలకెక్కఁగా
యిన్నిటా నిట్టె శ్రీ వేంకటేశుఁడు గూడెనమ్మా
(||pallavi||)
sĕpparādu sūbarādu sĕliyabhāvamu nem̐ḍu
vuppadillum̐ jĕmaḍado nussuranīnammā
(||||)
sakkam̐dana mŏgavaṁka javvana midŏgavaṁka
mŏkkalabubadi mīm̐di moha mŏgavaṁka
vŏkkaḍŏkkaḍigim̐gā kuvida nivvĕragudo
mukkumīm̐divelidoḍa momu vaṁchĕnammā
(||||)
sittabu korigalado siggaribhāvamudoḍa
pŏttula sĕlulu sĕppe budduladoḍa
yĕttina tamagamuna nĕduru mām̐ṭāḍalega
tattarānam̐ danalona tāne navvīnammā
(||||)
kannulam̐ gāvulu derĕ kaḽalu momunam̐ derĕ
tinnani kĕmmovinĕllā tenelu gārĕ
vĕnnĕlavaṁṭivalabu veḍugam̐ dalagĕkkam̐gā
yinniḍā niṭṭĕ śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕnammā