చెప్పరాదు చూపరాదు చెలియ మోహము నేఁడు
(॥పల్లవి॥)
చెప్పరాదు చూపరాదు చెలియ మోహము నేఁడు
వుప్పటించి దూరీ పతి కొప్పగించవె
(॥చెప్ప॥)
తలఁ పెంతవేఁడోకాని తరుణిమైకాఁకలైతే
వెలి నంటరాదు చేత విరహవేళ
వల పెంత చిక్కోకాని వాలినయీనెరులైతే
కలగలపైన చిక్కు కడగానరాదు
(॥చెప్ప॥)
కోరికలెన్నోకాని గుబురుఁబులకలైతే
యేరి యెంచరా దెవ్వరి కీవేళను
నీరసమై గుండె యెంత నీరాయనోకాని
యేరులచెమటలైతే నెడతెగవు
(॥చెప్ప॥)
యెంత అలయికోకాని యీ యింతియధరమైతే
వంతుల నప్పుడే కడువసివాడెను
రంతుల శ్రీవేంకటేశురతి యెంత నిబ్బరమో
చెంతల నీవేళ మార్పు చిమ్మిరేఁగెను
(||pallavi||)
sĕpparādu sūbarādu sĕliya mohamu nem̐ḍu
vuppaḍiṁchi dūrī padi kŏppagiṁchavĕ
(||sĕppa||)
talam̐ pĕṁtavem̐ḍogāni taruṇimaigām̐kalaide
vĕli naṁṭarādu seda virahaveḽa
vala pĕṁta sikkogāni vālinayīnĕrulaide
kalagalabaina sikku kaḍagānarādu
(||sĕppa||)
korigalĕnnogāni guburum̐bulagalaide
yeri yĕṁcharā dĕvvari kīveḽanu
nīrasamai guṁḍĕ yĕṁta nīrāyanogāni
yerulasĕmaḍalaide nĕḍadĕgavu
(||sĕppa||)
yĕṁta alayigogāni yī yiṁtiyadharamaide
vaṁtula nappuḍe kaḍuvasivāḍĕnu
raṁtula śhrīveṁkaḍeśhuradi yĕṁta nibbaramo
sĕṁtala nīveḽa mārbu simmirem̐gĕnu