చెప్పరాదు నీవుండేటి చెలువములు
(॥పల్లవి॥)
చెప్పరాదు నీవుండేటి చెలువములు
చిప్పిలీ నీ మేననెల్లా సింగారాలు
(॥చెప్ప॥)
కతలుగాఁ బానుపుపై కాఁగిటఁ బెనఁగేవేళ
సతిచెమటే పన్నీటి జలకములు
యితవుగా లోలోన యెనసి వుండేటివేళ
గతిగూడ నవ్వేనవ్వు కప్పురకాపు
(॥చెప్ప॥)
సొలసి సొలసి నీతో జోడైవుండేటివేళ
తలిరుఁబోడిచూపులే తట్టుపుణుఁగు
వులుకనితమకాన వురమెక్కినట్టివేళ
నిలువుమేనికాంతి నీమేని సొమ్ములు
(॥చెప్ప॥)
అంగపురతులఁ గూడి అలసివుండేటివేళ
అంగనమోవితీపులే యారగింపులు
చెంగటనలమేల్‌మంగ శ్రీ వేంకటేశ నిన్ను
నంగవించి కూడె నీవే యఖిలభోగాలు
(||pallavi||)
sĕpparādu nīvuṁḍeḍi sĕluvamulu
sippilī nī menanĕllā siṁgārālu
(||sĕppa||)
kadalugām̐ bānububai kām̐giḍam̐ bĕnam̐geveḽa
sadisĕmaḍe pannīḍi jalagamulu
yidavugā lolona yĕnasi vuṁḍeḍiveḽa
gadigūḍa navvenavvu kappuragābu
(||sĕppa||)
sŏlasi sŏlasi nīdo joḍaivuṁḍeḍiveḽa
talirum̐boḍisūbule taṭṭubuṇum̐gu
vuluganidamagāna vuramĕkkinaṭṭiveḽa
niluvumenigāṁti nīmeni sŏmmulu
(||sĕppa||)
aṁgaburadulam̐ gūḍi alasivuṁḍeḍiveḽa
aṁganamovidībule yāragiṁpulu
sĕṁgaḍanalamelmaṁga śhrī veṁkaḍeśha ninnu
naṁgaviṁchi kūḍĕ nīve yakhilabhogālu