Sepparaadu nee sompu simmiremge vedugalu

చెప్పరాదు నీ సొంపు చిమ్మిరేఁగె వేడుకలు
Language

(॥పల్లవి॥)
చెప్పరాదు నీ సొంపు చిమ్మిరేఁగె వేడుకలు
కప్పురగంది మొగము కానవచ్చెను

(॥చెప్ప॥)
కళలు రేఁగె నీ మోము కాంతఁ దలఁచుకొంటివో
వలనై యాపె యీడకు వచ్చేననెనో
తొలఁగక గవాక్షులు తొంగిచూచెనో నిన్ను
వెలినుండే తనెలుఁగు వినుపించెనో

(॥చెప్ప॥)
పులకించె నీ చెక్కులు పొలఁతి సేస చల్లెనో
కలువరేకులదండ కాను కంపెనో
కొలఁది చన్నులు వ్రాసి గురుతులు వుత్తెంచెనో
పలుమారు నీ మీఁది పదములు వాడెనో

(॥చెప్ప॥)
చెలవుల నవ్వుదేరి చెలి నీలోన నున్నదో
కలసి నీవురముపై కాఁపున్నదో
యెలమి మీరిద్దరును యేలితిరి మమ్మునిట్టె
అలరి శ్రీవేంకటేశ ఆపె బుద్ది చెప్పెనో

(||pallavi||)
sĕpparādu nī sŏṁpu simmirem̐gĕ veḍugalu
kappuragaṁdi mŏgamu kānavachchĕnu

(||sĕppa||)
kaḽalu rem̐gĕ nī momu kāṁtam̐ dalam̐sugŏṁṭivo
valanai yābĕ yīḍagu vachchenanĕno
tŏlam̐gaga gavākṣhulu tŏṁgisūsĕno ninnu
vĕlinuṁḍe tanĕlum̐gu vinubiṁchĕno

(||sĕppa||)
pulagiṁchĕ nī sĕkkulu pŏlam̐ti sesa sallĕno
kaluvareguladaṁḍa kānu kaṁpĕno
kŏlam̐di sannulu vrāsi gurudulu vuttĕṁchĕno
palumāru nī mīm̐di padamulu vāḍĕno

(||sĕppa||)
sĕlavula navvuderi sĕli nīlona nunnado
kalasi nīvuramubai kām̐punnado
yĕlami mīriddarunu yelidiri mammuniṭṭĕ
alari śhrīveṁkaḍeśha ābĕ buddi sĕppĕno