Sepparaadu nee siggaridanamu

చెప్పరాదు నీ సిగ్గరితనము
Language

(॥పల్లవి॥)
చెప్పరాదు నీ సిగ్గరితనము
ముప్పిరి గొంటె మోపెఁడు గాదా

(॥చెప్ప॥)
ఆనపడి ని న్నంటి చెనకితే
దోసమా మమ్ము దూరఁగఁ జూచేవు
వేసా లింతే కాక వెలఁదులు నీ మెయిఁ
జేసిన చేఁతలు చేటఁడు గావా

(॥చెప్ప॥)
నగుతా నిన్ను నాఁటఁగఁ దిట్టఁ గ
తగవా యేమి తప్పక చూచేవు
బిగిసేవు గాక ప్రియురాండ్లు నిన్ను
వొగరు లాడేది వోదెఁడు గావా

(॥చెప్ప॥)
గారవించి రతిఁ గాలుచాఁచితే
నేరమా యిది నీ వనేవు గాకా
యీరీతి శ్రీవేంకటేశ నెల్లూరిలోఁ
గోరినసతులు కోట్లు గారా

(||pallavi||)
sĕpparādu nī siggaridanamu
muppiri gŏṁṭĕ mobĕm̐ḍu gādā

(||sĕppa||)
ānabaḍi ni nnaṁṭi sĕnagide
dosamā mammu dūram̐gam̐ jūsevu
vesā liṁte kāga vĕlam̐dulu nī mĕyim̐
jesina sem̐talu seḍam̐ḍu gāvā

(||sĕppa||)
nagudā ninnu nām̐ṭam̐gam̐ diṭṭam̐ ga
tagavā yemi tappaga sūsevu
bigisevu gāga priyurāṁḍlu ninnu
vŏgaru lāḍedi vodĕm̐ḍu gāvā

(||sĕppa||)
gāraviṁchi radim̐ gālusām̐side
neramā yidi nī vanevu gāgā
yīrīdi śhrīveṁkaḍeśha nĕllūrilom̐
gorinasadulu koṭlu gārā