చెప్పరాదు నీ పగటు సిబ్బితిపడ వేమిటా
(॥పల్లవి॥)
చెప్పరాదు నీ పగటు సిబ్బితిపడ వేమిటా
అప్పటి మురిసేవు నాయంతదానవా
(॥చెప్ప॥)
యెంతకొప్పు వెట్టితివే యేమి నిక్కి చూచేవే
జంతవలె పతిమోము సారె సారెకు
పంతపు సతులు లాతనిపక్క నిట్టెవుండఁగాను
యెంతేసిచేఁతల నీవు యెలయించేవే
(॥చెప్ప॥)
సింగారా లెంత చూపేవే చిరున వ్వేమి నవ్వేవే
అంగడి వీధినుండే యాతనితోను
చెంగట మేటామేటీలు సేవలెల్లాఁ జేయఁగాను
సంగతెఱఁగక యేమి చవులు రేఁచేవే
(॥చెప్ప॥)
పందే లేల వేసేవే పై పై నేల పెనఁగేవే
యిందరిలో శ్రీవేంకటేశుఁ జొక్కించి
కందువఁ గూడిన నేము కాఁపురాలు సేయఁగాను
చెంది నీవప్పటినేల బెనకఁజూచేవే
(||pallavi||)
sĕpparādu nī pagaḍu sibbidibaḍa vemiḍā
appaḍi murisevu nāyaṁtadānavā
(||sĕppa||)
yĕṁtagŏppu vĕṭṭidive yemi nikki sūseve
jaṁtavalĕ padimomu sārĕ sārĕgu
paṁtabu sadulu lādanibakka niṭṭĕvuṁḍam̐gānu
yĕṁtesisem̐tala nīvu yĕlayiṁcheve
(||sĕppa||)
siṁgārā lĕṁta sūbeve siruna vvemi navveve
aṁgaḍi vīdhinuṁḍe yādanidonu
sĕṁgaḍa meḍāmeḍīlu sevalĕllām̐ jeyam̐gānu
saṁgadĕṟam̐gaga yemi savulu rem̐seve
(||sĕppa||)
paṁde lela veseve pai pai nela pĕnam̐geve
yiṁdarilo śhrīveṁkaḍeśhum̐ jŏkkiṁchi
kaṁduvam̐ gūḍina nemu kām̐purālu seyam̐gānu
sĕṁdi nīvappaḍinela bĕnagam̐jūseve