Sepparaadu mee pomdulu siguru semgainattu

చెప్పరాదు మీ పొందులు చిగురు చేఁగైనట్టు
Language

(॥పల్లవి॥)
చెప్పరాదు మీ పొందులు చిగురు చేఁగైనట్టు
ఇప్పుడే మెచ్చితిమి నే మిద్దరిఁ జూచి

(॥చెప్ప॥)
చెలిఁ జూచితివి నీవు చెలియూ నిన్నిటు చూచె
కలువలుఁ దామరలుఁ గలసినట్టు
పలికితి వింతితోడ పడఁతియు మాటలాడె
చిలుకలుఁ గోవిలలు చిమ్మిరేఁగినట్లు

(॥చెప్ప॥)
అప్పుడే నీవు నవ్వితి వంగన నీతో నవ్వె
కప్పురాలు వెన్నెలలుఁ గలసినట్టు
నెప్పునఁ జేయివేసితివి నెలఁతయుఁ జేయివేసె
వొప్పగుఁదీగెలుఁ దూండ్లొన గూడినట్లు

(॥చెప్ప॥)
పట్టితి నీ కెపయ్యద భామయు నీచేయి వట్టె
గట్టి హేమాద్రి నీలాద్రిఁ గలసినట్టు
ఇట్టె శ్రీవేంకటేశ యీసతి నీ వురముపైఁ
బెట్టితి నాకె నిలిచెఁ బెండ్లాడినట్లు

(||pallavi||)
sĕpparādu mī pŏṁdulu siguru sem̐gainaṭṭu
ippuḍe mĕchchidimi ne middarim̐ jūsi

(||sĕppa||)
sĕlim̐ jūsidivi nīvu sĕliyū ninniḍu sūsĕ
kaluvalum̐ dāmaralum̐ galasinaṭṭu
paligidi viṁtidoḍa paḍam̐tiyu māḍalāḍĕ
silugalum̐ govilalu simmirem̐ginaṭlu

(||sĕppa||)
appuḍe nīvu navvidi vaṁgana nīdo navvĕ
kappurālu vĕnnĕlalum̐ galasinaṭṭu
nĕppunam̐ jeyivesidivi nĕlam̐tayum̐ jeyivesĕ
vŏppagum̐dīgĕlum̐ dūṁḍlŏna gūḍinaṭlu

(||sĕppa||)
paṭṭidi nī kĕbayyada bhāmayu nīseyi vaṭṭĕ
gaṭṭi hemādri nīlādrim̐ galasinaṭṭu
iṭṭĕ śhrīveṁkaḍeśha yīsadi nī vuramubaim̐
bĕṭṭidi nāgĕ nilisĕm̐ bĕṁḍlāḍinaṭlu