చెప్పరాదే నీ మోహము చెలియ నేడు
(॥పల్లవి॥)
చెప్పరాదే నీ మోహము చెలియ నేడు
కప్పురవిడేలలోనే కంటిమి యిన్నియును
(॥చెప్ప॥)
పొనుఁగ కాతనితోడ పొందుసేసితేనెట్టో
వినుకలికే యింత వేడుకపడేవు
చనవిచ్చి యప్పటిని సరసమాడితే నెట్టో
కనుకలినే ఇంత కడుఁదమకించేవు
(॥చెప్ప॥)
పరగ నేకతమున బాసగొంటే నింకనెట్టో
తొరలిపుమాటకే హత్తుకోవచ్చేవు
సరవితో ననుపైతే జట్టిగొనే దిఁకనెట్టో
చొరవలకే ఇంత చొక్కి మెచ్చేవు
(॥చెప్ప॥)
తేనెమోవి సోఁకితేను తిరమయ్య దిఁకనెట్టో
పానుపు చేరినందుకే పసమించేవు
యీనెపాన నిన్ను నన్ను నేలె శ్రీవేంకటేశుఁడు
ఆనుక నవ్వినందుకే అరుదందేవు
(||pallavi||)
sĕpparāde nī mohamu sĕliya neḍu
kappuraviḍelalone kaṁṭimi yinniyunu
(||sĕppa||)
pŏnum̐ga kādanidoḍa pŏṁdusesidenĕṭṭo
vinugalige yiṁta veḍugabaḍevu
sanavichchi yappaḍini sarasamāḍide nĕṭṭo
kanugaline iṁta kaḍum̐damagiṁchevu
(||sĕppa||)
paraga negadamuna bāsagŏṁṭe niṁkanĕṭṭo
tŏralibumāḍage hattugovachchevu
saravido nanubaide jaṭṭigŏne dim̐kanĕṭṭo
sŏravalage iṁta sŏkki mĕchchevu
(||sĕppa||)
tenĕmovi som̐kidenu tiramayya dim̐kanĕṭṭo
pānubu serinaṁduge pasamiṁchevu
yīnĕbāna ninnu nannu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
ānuga navvinaṁduge arudaṁdevu