Sepparaadaa naadonu sevulaaraa vinemgaani

చెప్పరాదా నాతోను చెవులారా వినేఁగాని
Language

(॥పల్లవి॥)
చెప్పరాదా నాతోను చెవులారా వినేఁగాని
వుప్పతిలుఁ జెమట లేలూరీనయ్యా మేనను

(॥చెప్ప॥)
వాడికమాట లాడి వచ్చేనంటాఁ జెప్పిపంపి
యేడనుంటివయ్యా నీ విందాఁకాను
జాడదప్పక నాతోనే సరసములాడితివి
వీడె మెవ్వతిచ్చెనయ్యా వేడుకతో నీకు

(॥చెప్ప॥)
బలిమి నన్నుఁ బెండ్లాడి బాసలెల్లా నాకిచ్చి
తలఁచే దెక్కడనయ్యా తమితో నీవు
కలదెల్లా నామీఁదనే కందువవలపు నీకు
చెలి మేడఁ గల్గెనయ్యా చెలులతో నేఁడు

(॥చెప్ప॥)
తామెరపువ్వున వేసి తగ నన్నుఁ గాంగిలించి
యేమగువఁ జూచేవయ్య ఇప్పుడు నీవు
ఆముక శ్రీవేంకటేశ అలమేల్ మంగనే నేను
కామించి నన్నేలితివి కానీవయ్యా మెచ్చితి

(||pallavi||)
sĕpparādā nādonu sĕvulārā vinem̐gāni
vuppadilum̐ jĕmaḍa lelūrīnayyā menanu

(||sĕppa||)
vāḍigamāḍa lāḍi vachchenaṁṭām̐ jĕppibaṁpi
yeḍanuṁṭivayyā nī viṁdām̐kānu
jāḍadappaga nādone sarasamulāḍidivi
vīḍĕ mĕvvadichchĕnayyā veḍugado nīgu

(||sĕppa||)
balimi nannum̐ bĕṁḍlāḍi bāsalĕllā nāgichchi
talam̐se dĕkkaḍanayyā tamido nīvu
kaladĕllā nāmīm̐dane kaṁduvavalabu nīgu
sĕli meḍam̐ galgĕnayyā sĕlulado nem̐ḍu

(||sĕppa||)
tāmĕrabuvvuna vesi taga nannum̐ gāṁgiliṁchi
yemaguvam̐ jūsevayya ippuḍu nīvu
āmuga śhrīveṁkaḍeśha alamel maṁgane nenu
kāmiṁchi nannelidivi kānīvayyā mĕchchidi