Sepparaa neegu naadodu siggu limkela

చెప్పరా నీకు నాతోడు సిగ్గు లింకేల
Language

(॥పల్లవి॥)
చెప్పరా నీకు నాతోడు సిగ్గు లింకేల
రెప్పల తుదల నేఁడు రిచ్చవడి వున్నది

(॥చెప॥)
యెవ్వతికో మేలువాడ విటు నీవు గాఁబోలు
అవ్వల నీచేయి వెచ్చనై వున్నది
దవ్వుల నున్నయాకెఁ దలఁపునఁ బారఁబోలు
పువ్వువంటిమోపు చిన్నఁబోయి వున్నది

(॥చెప॥)
యిక్కువ చెప్పెంపి యాకె యీసుద్ధికి రాఁబోలు
చెక్కుచేతితో నీకు చింత వున్నది
దక్కి ఈపెవలపు నీ తలకెక్కి వుండఁబోలు
పిక్కటిల్లి మాటల తబ్బిబ్బులై వున్నది

(॥చెప॥)
తొయ్యలి గొన్న బాసలు తోయరాకుండఁగఁ బోలు
కొయ్యతనాలకు మతిఁ గొంకి వున్నది
నెయ్యపు శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యియ్యడ నన్నుఁగూడితి వెందు నాపె వున్నది

(||pallavi||)
sĕpparā nīgu nādoḍu siggu liṁkela
rĕppala tudala nem̐ḍu richchavaḍi vunnadi

(||sĕba||)
yĕvvadigo meluvāḍa viḍu nīvu gām̐bolu
avvala nīseyi vĕchchanai vunnadi
davvula nunnayāgĕm̐ dalam̐punam̐ bāram̐bolu
puvvuvaṁṭimobu sinnam̐boyi vunnadi

(||sĕba||)
yikkuva sĕppĕṁpi yāgĕ yīsuddhigi rām̐bolu
sĕkkusedido nīgu siṁta vunnadi
dakki ībĕvalabu nī talagĕkki vuṁḍam̐bolu
pikkaḍilli māḍala tabbibbulai vunnadi

(||sĕba||)
tŏyyali gŏnna bāsalu toyarāguṁḍam̐gam̐ bolu
kŏyyadanālagu madim̐ gŏṁki vunnadi
nĕyyabu śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yiyyaḍa nannum̐gūḍidi vĕṁdu nābĕ vunnadi