Sepparaa dimdaamkanaide seli yunna bhaavamu

చెప్పరా దిందాఁకనైతె చెలి యున్న భావము
Language

(॥పల్లవి॥)
చెప్పరా దిందాఁకనైతె చెలి యున్న భావము
వుప్పుచిం దినుమడించె నుండ నుండఁగాను

(॥చెప్పరా॥)
మగువకు నేఁడుగా మనికిత మెల్లఁ బానె
వెగటు వో నీ వింటికి విచ్చేయఁగాను
మొగచాటు లే దాయ ముచ్చట లెల్లఁ దీరె
సొగిసి నీవు మొగము చూడఁగాను

(॥చెప్పరా॥)
సుదతి కీ వేళ గా షోడశకళలు నిండె
మదనజకనకపు నీవు మన్నించఁగాను
తుదిపదమున కెక్క తుందుడుకు లెల్లఁ బోయ
పొదిగి పట్టి కాఁగిట బుజ్జగించఁగాను

(॥చెప్పరా॥)
అంగన కిట్టె కా ఆతు మెల్ల జల నాయ
సంగతిగా రతిఁ గూడి చన వియ్యఁగా
చెంగల శ్రీవెంకటేశ చేరఁగలమేలు చేరె
సింగారించి మీఁద చెక్కు నొక్కఁగాను

(||pallavi||)
sĕpparā diṁdām̐kanaidĕ sĕli yunna bhāvamu
vuppusiṁ dinumaḍiṁchĕ nuṁḍa nuṁḍam̐gānu

(||sĕpparā||)
maguvagu nem̐ḍugā manigida mĕllam̐ bānĕ
vĕgaḍu vo nī viṁṭigi vichcheyam̐gānu
mŏgasāḍu le dāya muchchaḍa lĕllam̐ dīrĕ
sŏgisi nīvu mŏgamu sūḍam̐gānu

(||sĕpparā||)
sudadi kī veḽa gā ṣhoḍaśhagaḽalu niṁḍĕ
madanajaganagabu nīvu manniṁcham̐gānu
tudibadamuna kĕkka tuṁduḍugu lĕllam̐ boya
pŏdigi paṭṭi kām̐giḍa bujjagiṁcham̐gānu

(||sĕpparā||)
aṁgana kiṭṭĕ kā ādu mĕlla jala nāya
saṁgadigā radim̐ gūḍi sana viyyam̐gā
sĕṁgala śhrīvĕṁkaḍeśha seram̐galamelu serĕ
siṁgāriṁchi mīm̐da sĕkku nŏkkam̐gānu