Seppanele yimkaam dana semtalu naagu

చెప్పనేలే యింకాఁ దన చేఁతలు నాకు
Language

(॥పల్లవి॥)
చెప్పనేలే యింకాఁ దన చేఁతలు నాకు
కప్పురమిచ్చి నా మతి కరఁగించవలెనా

(॥చెప్ప॥)
ముందరితనలాలన మోములోనే కానరాదా
కిందుపడి యింత బుజ్జగించవలెనా
మందలించిన నిజము మాటలోనే కానరాదా
విందువలెఁ జెక్కునొక్కి వేఁడుకొనవలెనా

(॥చెప్ప॥)
నమ్మికలు తానిచ్చేవి నవ్వులోనే కానరాదా
పిమ్మటివారిపై నాన పెట్టవలెనా
పమ్మిన తనవలపు పానువుపైఁ గానరాదా
చిమ్ముల మోవెల్ల గంటిసేయఁగ వలెనా

(॥చెప్ప॥)
బలుతమకము చేయిపట్టినందే కానరాదా
సొలసి తనబావము చూపవలెనా
యెలమి శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
తెలివి నయగారాలతేనె వుయ్యవలెనా

(||pallavi||)
sĕppanele yiṁkām̐ dana sem̐talu nāgu
kappuramichchi nā madi karam̐giṁchavalĕnā

(||sĕppa||)
muṁdaridanalālana momulone kānarādā
kiṁdubaḍi yiṁta bujjagiṁchavalĕnā
maṁdaliṁchina nijamu māḍalone kānarādā
viṁduvalĕm̐ jĕkkunŏkki vem̐ḍugŏnavalĕnā

(||sĕppa||)
nammigalu tānichchevi navvulone kānarādā
pimmaḍivāribai nāna pĕṭṭavalĕnā
pammina tanavalabu pānuvubaim̐ gānarādā
simmula movĕlla gaṁṭiseyam̐ga valĕnā

(||sĕppa||)
baludamagamu seyibaṭṭinaṁde kānarādā
sŏlasi tanabāvamu sūbavalĕnā
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
tĕlivi nayagārāladenĕ vuyyavalĕnā