Seppanela nee suddulu sellubadai vumdamgaanu

చెప్పనేల నీ సుద్దులు చెల్లుబడై వుండఁగాను
Language

(॥పల్లవి॥)
చెప్పనేల నీ సుద్దులు చెల్లుబడై వుండఁగాను
కప్పిన పట్నాలవారు గందమిత్తురా

(॥చెప్ప॥)
నాలిసేసినవాఁడవు నగ నీవే నేరుతువు
మేలు మేలనుచు నిన్ను మెచ్చఁగనేల
వాలుమగఁడవు యింతవాఁడవు గాకుండితే
మూలనున్న గొల్లెతలు మోహింతురాఁ

(॥చెప్ప॥)
వలపించినవాడవు వంకలాడ నేరుతువు
నులివాఁడి గోరఁ జెక్కునొక్కఁగనేల
కలికితనాల నింతఘనుఁడవు గాకుఁడితే
పొలసి పురసతులు భోగింతురా

(॥చెప్ప॥)
కొంగువట్టినవాఁడవు కూడ నిట్టె నేరుతువు
వెంగలితనాన నిన్ను వేఁడుకోనేల
సంగతి శ్రీవేంకటేశ జాణ వింతగాకుండితే
జంగిలి పదారువేలు చనవిత్తురా

(||pallavi||)
sĕppanela nī suddulu sĕllubaḍai vuṁḍam̐gānu
kappina paṭnālavāru gaṁdamitturā

(||sĕppa||)
nālisesinavām̐ḍavu naga nīve neruduvu
melu melanusu ninnu mĕchcham̐ganela
vālumagam̐ḍavu yiṁtavām̐ḍavu gāguṁḍide
mūlanunna gŏllĕdalu mohiṁturām̐

(||sĕppa||)
valabiṁchinavāḍavu vaṁkalāḍa neruduvu
nulivām̐ḍi goram̐ jĕkkunŏkkam̐ganela
kaligidanāla niṁtaghanum̐ḍavu gāgum̐ḍide
pŏlasi purasadulu bhogiṁturā

(||sĕppa||)
kŏṁguvaṭṭinavām̐ḍavu kūḍa niṭṭĕ neruduvu
vĕṁgalidanāna ninnu vem̐ḍugonela
saṁgadi śhrīveṁkaḍeśha jāṇa viṁtagāguṁḍide
jaṁgili padāruvelu sanavitturā