చెప్పనేల నీ గుణాలు చెలువుఁడ చాలుఁ జాలు
(॥పల్లవి॥)
చెప్పనేల నీ గుణాలు చెలువుఁడ చాలుఁ జాలు
వుప్పుదినుటాఁ గాక వుపతాపమా
(॥చెప్ప॥)
కంటిఁ గంటి నీచేఁత కన్నులతుదలనే
వెంటనే వీనులనింక వినవలెనా
కంటకములాడ నిన్ను ఘనుఁడ నేనోపనోప
గింటెల నవ్వులలోన గిలిగింతలా
(॥చెప్ప॥)
విరహన నీకుఁగా నే వేదనఁబొందుట గాక
వెరవెరఁగక నీతో వెళ్ళనాడేనా
నెరజాణవిన్నిటాను నీవేడ నేనేడ
వులిసిన మీఁదనింక వుడుకులునా
(॥చెప్ప॥)
బెట్టుగాఁ గాఁగిట నిన్ను బిగియించుకొంట గాక
నట్టుకొట్టి మోవిమీఁద నసికాట్ల
గుట్టుతో శ్రీవేంకటేశ కూడితివి నన్నునిట్లే
చెట్టువట్టి తీసి యింకాఁ జేసన్నలా
(||pallavi||)
sĕppanela nī guṇālu sĕluvum̐ḍa sālum̐ jālu
vuppudinuḍām̐ gāga vubadābamā
(||sĕppa||)
kaṁṭim̐ gaṁṭi nīsem̐ta kannuladudalane
vĕṁṭane vīnulaniṁka vinavalĕnā
kaṁṭagamulāḍa ninnu ghanum̐ḍa nenobanoba
giṁṭĕla navvulalona giligiṁtalā
(||sĕppa||)
virahana nīgum̐gā ne vedanam̐bŏṁduḍa gāga
vĕravĕram̐gaga nīdo vĕḽḽanāḍenā
nĕrajāṇavinniḍānu nīveḍa neneḍa
vulisina mīm̐daniṁka vuḍugulunā
(||sĕppa||)
bĕṭṭugām̐ gām̐giḍa ninnu bigiyiṁchugŏṁṭa gāga
naṭṭugŏṭṭi movimīm̐da nasigāṭla
guṭṭudo śhrīveṁkaḍeśha kūḍidivi nannuniṭle
sĕṭṭuvaṭṭi tīsi yiṁkām̐ jesannalā