చెప్పనీవే తన సుద్ది చెలులతో నెల్లాను
(॥పల్లవి॥)
చెప్పనీవే తన సుద్ది చెలులతో నెల్లాను
చప్పనౌతాఁ దియ్యనౌతా చవిగొనే నిదివో
(॥చెప్పనీ॥)
రానీవే అందుకేమి రమణుఁ డిందాఁకా
నేనేకా దీకొని నిలిచేదానా
కానీవే పువ్వువలెఁ గప్పురము నుండదా
తేనెవుతా నూనెవుతాఁ దేటపడీ నపుడే
(॥చెప్పనీ॥)
నవ్వ నీవే తా నన్ను నయమైనరీతి నెల్లా
అవ్వల నేనేకా గుఱయ్యేదానా
తవ్వనీనే యంతైనా తగ నిసుకపాఁతర
పువ్వులయి పిందెలయ్యీ పొద్దుగూఁకేకొందికి
(॥చెప్పనీ॥)
చల్లనీవే కూరిములు సారె సారె నామీఁద
మొల్లమి నేనేకా మోహపుదానా
కొల్ల శ్రీవేంకటపతి కూడె నాకౌఁగిటిలోన
అల్లమవుతా బెల్లమవుతా అడిగేఁబో యిఁకనూ
(||pallavi||)
sĕppanīve tana suddi sĕlulado nĕllānu
sappanaudām̐ diyyanaudā savigŏne nidivo
(||sĕppanī||)
rānīve aṁdugemi ramaṇum̐ ḍiṁdām̐kā
nenegā dīgŏni nilisedānā
kānīve puvvuvalĕm̐ gappuramu nuṁḍadā
tenĕvudā nūnĕvudām̐ deḍabaḍī nabuḍe
(||sĕppanī||)
navva nīve tā nannu nayamainarīdi nĕllā
avvala nenegā guṟayyedānā
tavvanīne yaṁtainā taga nisugabām̐tara
puvvulayi piṁdĕlayyī pŏddugūm̐kegŏṁdigi
(||sĕppanī||)
sallanīve kūrimulu sārĕ sārĕ nāmīm̐da
mŏllami nenegā mohabudānā
kŏlla śhrīveṁkaḍabadi kūḍĕ nāgaum̐giḍilona
allamavudā bĕllamavudā aḍigem̐bo yim̐kanū