చెప్పనీవే సుద్దులు చేరి చెక్కు నే నొక్కితే
(॥పల్లవి॥)
చెప్పనీవే సుద్దులు చేరి చెక్కు నే నొక్కితే
వుప్పుగప్పురమువలె నొప్పనఁ గావలెను
(॥చెప్ప॥)
మాననీవే తా నన్ను మానినా నల్లంతనుండి
సానఁబట్టేచవులైనాఁ జల్లకుండేనా
నాననీవే వలపులు నాకుఁ దనకుఁ గోమటి -
మేనరికమైనట్టు మెచ్చుగావలెను
(॥చెప్ప॥)
వుండనీవే ఆడనీడ వుండినా నే నిక్కిచూచి
నిండువెన్నులనవ్వులు నించకుండేనా
పండనీవే కోరికలు పంతాలు తనకు నాకు
దండ నేళ్ల వెంట చాళ్లై తగులఁగవలెను
(॥చెప్ప॥)
చేయనీవే సన్నలు చేరి నేనేఁ గాఁగిలించి
బాయిటనే తన్నుఁ గొంగుపట్టకుండేనా
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
కాయలే పండ్లయినట్టు కతలు గావలెను
(||pallavi||)
sĕppanīve suddulu seri sĕkku ne nŏkkide
vuppugappuramuvalĕ nŏppanam̐ gāvalĕnu
(||sĕppa||)
mānanīve tā nannu māninā nallaṁtanuṁḍi
sānam̐baṭṭesavulainām̐ jallaguṁḍenā
nānanīve valabulu nāgum̐ danagum̐ gomaḍi -
menarigamainaṭṭu mĕchchugāvalĕnu
(||sĕppa||)
vuṁḍanīve āḍanīḍa vuṁḍinā ne nikkisūsi
niṁḍuvĕnnulanavvulu niṁchaguṁḍenā
paṁḍanīve korigalu paṁtālu tanagu nāgu
daṁḍa neḽla vĕṁṭa sāḽlai tagulam̐gavalĕnu
(||sĕppa||)
seyanīve sannalu seri nenem̐ gām̐giliṁchi
bāyiḍane tannum̐ gŏṁgubaṭṭaguṁḍenā
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
kāyale paṁḍlayinaṭṭu kadalu gāvalĕnu