Seppamgam jaalara siggunanoo

చెప్పఁగఁ జాలర సిగ్గుననూ
Language

(॥పల్లవి॥)
చెప్పఁగఁ జాలర సిగ్గుననూ
అప్పుడే నవ్వుల నలసితిని

(॥॥)
పాయకురా ననుఁ బైకొని నీ
మాయల వలపుల మరిగితిని
చేయి వేసి యింకాఁ జెనకేవా నీ
కాయపు సోఁ కులఁ గరఁగితిని

(॥॥)
మానకురా యిటు మాటాడీని
నానుడిబాసలు నమ్మితిని
కానీ లే యెఱుఁగుదుఁ గత లేల
నేనే నీ వై నెగడితిని

(॥॥)
విడువకురా వేయి వే యైనా
వుడివోని రతుల నొనరితిని
కడఁగిన శ్రీవేంకట విభుఁడా నీ
గుడికొను కౌఁగిటఁ గూడితిని.

(||pallavi||)
sĕppam̐gam̐ jālara siggunanū
appuḍe navvula nalasidini

(||||)
pāyagurā nanum̐ baigŏni nī
māyala valabula marigidini
seyi vesi yiṁkām̐ jĕnagevā nī
kāyabu som̐ kulam̐ garam̐gidini

(||||)
mānagurā yiḍu māḍāḍīni
nānuḍibāsalu nammidini
kānī le yĕṟum̐gudum̐ gada lela
nene nī vai nĕgaḍidini

(||||)
viḍuvagurā veyi ve yainā
vuḍivoni radula nŏnaridini
kaḍam̐gina śhrīveṁkaḍa vibhum̐ḍā nī
guḍigŏnu kaum̐giḍam̐ gūḍidini.