Seppamgalabuddi neegum jeppidi mide

చెప్పఁగలబుద్ది నీకుఁ జెప్పితి మిదె
Language

(॥పల్లవి॥)
చెప్పఁగలబుద్ది నీకుఁ జెప్పితి మిదె
యెప్పుడూ మావల్ల దొసమేమీ లేదు సుమ్మీ

(॥చెప్ప॥)
పక్కునఁ జెలిచన్నులపైఁ గేలు చాఁచేవు
యెక్కుడుగొండలవంటి వింత కోపేవా
జక్కవలవంటివి చన్నులు నావియైతేను
చొక్కముగ నీయనువు చూచుకొనరాదా

(॥చెప్ప॥)
యేనిగెతొండాలఁబోలే ఇంతి తొడలమీఁదట
ఆనించేవు నీపాదము లంతకోపేవా
పూని యనఁటికంబాలపోలికే నాతొడలైతే
దీనివల్ల నీయనువుఁ దెలుసుకోరాదా

(॥చెప్ప॥)
అడరుచు నద్దపుమోమాపెను మోవిమ్మనేవు
తడవి శ్రీవేంకటేశ దానికోపేవా
బడి నలమేల్మంగను పద్మము నామొకమైతే
కడఁగి నన్నేలితివి కనుకోరాదా

(||pallavi||)
sĕppam̐galabuddi nīgum̐ jĕppidi midĕ
yĕppuḍū māvalla dŏsamemī ledu summī

(||sĕppa||)
pakkunam̐ jĕlisannulabaim̐ gelu sām̐sevu
yĕkkuḍugŏṁḍalavaṁṭi viṁta kobevā
jakkavalavaṁṭivi sannulu nāviyaidenu
sŏkkamuga nīyanuvu sūsugŏnarādā

(||sĕppa||)
yenigĕdŏṁḍālam̐bole iṁti tŏḍalamīm̐daḍa
āniṁchevu nībādamu laṁtagobevā
pūni yanam̐ṭigaṁbālabolige nādŏḍalaide
dīnivalla nīyanuvum̐ dĕlusugorādā

(||sĕppa||)
aḍarusu naddabumomābĕnu movimmanevu
taḍavi śhrīveṁkaḍeśha dānigobevā
baḍi nalamelmaṁganu padmamu nāmŏgamaide
kaḍam̐gi nannelidivi kanugorādā