చెప్పఁగల మాట లిఁకఁ జెప్పవయ్య
(॥పల్లవి॥)
చెప్పఁగల మాట లిఁకఁ జెప్పవయ్య
ముప్పిరి నిందుకె నేను మోము వంచే నయ్యా
(॥చెప్పఁ॥)
చలివేఁడి సటకాఁడ చదురుల జాణకాఁడ
మొలకనవ్వులతోను మొక్కె మయ్య
వలపులయండ గాసీ వాడికవెన్నెల గాసీ
అలరి యిందుకు వెర గందే మయ్యా
(॥చెప్పఁ॥)
వీదుల జాజరకాఁడ వేసాల వేడుకకాఁడ
యీదెఁస బాయము కాను కిచ్చే మయ్యా
తోదోపువసంత మిదే తొక్కుడుసరస మిదే
ఆదరాన నిందులోనే అలసే మయ్యా
(॥చెప్పఁ॥)
కైకోలు వేగిరకాఁడ కందువల వగకాఁడ
చేకొని నీచెప్పినట్టు సేసే మయ్యా
యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
మేకొని యిన్నిటా నిన్ను మెచ్చే మయ్యా
(||pallavi||)
sĕppam̐gala māḍa lim̐kam̐ jĕppavayya
muppiri niṁdugĕ nenu momu vaṁche nayyā
(||sĕppam̐||)
salivem̐ḍi saḍagām̐ḍa sadurula jāṇagām̐ḍa
mŏlaganavvuladonu mŏkkĕ mayya
valabulayaṁḍa gāsī vāḍigavĕnnĕla gāsī
alari yiṁdugu vĕra gaṁde mayyā
(||sĕppam̐||)
vīdula jājaragām̐ḍa vesāla veḍugagām̐ḍa
yīdĕm̐sa bāyamu kānu kichche mayyā
todobuvasaṁta mide tŏkkuḍusarasa mide
ādarāna niṁdulone alase mayyā
(||sĕppam̐||)
kaigolu vegiragām̐ḍa kaṁduvala vagagām̐ḍa
segŏni nīsĕppinaṭṭu sese mayyā
yīgaḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
megŏni yinniḍā ninnu mĕchche mayyā