Seppamgade vedugayyee selulagellaa maagu

చెప్పఁగదే వేడుకయ్యీ చెలులకెల్లా మాకు
Language

(॥పల్లవి॥)
చెప్పఁగదే వేడుకయ్యీ చెలులకెల్లా మాకు
చెప్పరానిచేఁత లేమి సేసెనే నీకు

(॥చెప్ప॥)
చెలరేఁగి లోలోలొనే చిరునవ్వులు నవ్వేవు
అలరి నీరమణుఁ డేమనెనే నీతో
తలఁచుకతలఁచుక దైవారేవు కళలు
మలసి తానెంత నిన్ను మన్నించెనే

(॥చెప్ప॥)
చొక్కుచు నలుదిక్కులు చూచిచూచి వేదకేవు
యక్కువ నడియాల మేమిచ్చెనే నీకు
మొక్కిమొక్కి గుట్టుతోడ మునుకొని మెచ్చేవు
చక్కఁగ నీ కాతఁ డెంతచనవు లొసయఁగెనే

(॥చెప్ప॥)
చెమటచిత్తడితోడ సిగ్గువడి వుందానవు
సమరతుల నీకెంత చవిచూపెనే
అమరె శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
తమిఁ గూడి నిన్ను నెంత తనివి నొందించెనే

(||pallavi||)
sĕppam̐gade veḍugayyī sĕlulagĕllā māgu
sĕpparānisem̐ta lemi sesĕne nīgu

(||sĕppa||)
sĕlarem̐gi lololŏne sirunavvulu navvevu
alari nīramaṇum̐ ḍemanĕne nīdo
talam̐sugadalam̐suga daivārevu kaḽalu
malasi tānĕṁta ninnu manniṁchĕne

(||sĕppa||)
sŏkkusu naludikkulu sūsisūsi vedagevu
yakkuva naḍiyāla memichchĕne nīgu
mŏkkimŏkki guṭṭudoḍa munugŏni mĕchchevu
sakkam̐ga nī kādam̐ ḍĕṁtasanavu lŏsayam̐gĕne

(||sĕppa||)
sĕmaḍasittaḍidoḍa sigguvaḍi vuṁdānavu
samaradula nīgĕṁta savisūbĕne
amarĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīvu
tamim̐ gūḍi ninnu nĕṁta tanivi nŏṁdiṁchĕne