చెప్పఁగదే అది చక్కఁజేసే నిపుడు
(॥పల్లవి॥)
చెప్పఁగదే అది చక్కఁజేసే నిపుడు
పిప్పిగట్ట నతనితో బిగిసేటి భావమో
(॥చెప్పఁ॥)
బంతిబోజనానకు పతి గాచుకుండఁగాను
యింతి తోడ నెత్తమాడే వెరఁగనట్టే
ఇంత సేయనేమిటికి యేకతాననేమైనా
కొంత గొంత వొట్టు వెట్టుకొంటివో చలానను
(॥చెప్పఁ॥)
వీడెమియ్య రాఁగాను విభుని కెదురురాక
నీడ ముసుఁగిడుకొని నిద్దిరించేవు
జోడువాయఁ బనిలేదు సొగియనివేళను
ఆడ బ్రహ్మచారి వ్రతమట్టె పట్టితివో
(॥చెప్పఁ॥)
శ్రీ వెంకటేశ్వరుఁడు చేరికూడి వుండఁగాను
పావురము పెట్టె మీఁద బత్తిసేసేవు
నీవాతని విడువవు నీమారు పలుకఁగ
యీవిగానతనిచేత నిప్పించుకొంటివో
(||pallavi||)
sĕppam̐gade adi sakkam̐jese nibuḍu
pippigaṭṭa nadanido bigiseḍi bhāvamo
(||sĕppam̐||)
baṁtibojanānagu padi gāsuguṁḍam̐gānu
yiṁti toḍa nĕttamāḍe vĕram̐ganaṭṭe
iṁta seyanemiḍigi yegadānanemainā
kŏṁta gŏṁta vŏṭṭu vĕṭṭugŏṁṭivo salānanu
(||sĕppam̐||)
vīḍĕmiyya rām̐gānu vibhuni kĕdururāga
nīḍa musum̐giḍugŏni niddiriṁchevu
joḍuvāyam̐ baniledu sŏgiyaniveḽanu
āḍa brahmasāri vradamaṭṭĕ paṭṭidivo
(||sĕppam̐||)
śhrī vĕṁkaḍeśhvarum̐ḍu serigūḍi vuṁḍam̐gānu
pāvuramu pĕṭṭĕ mīm̐da battisesevu
nīvādani viḍuvavu nīmāru palugam̐ga
yīvigānadaniseda nippiṁchugŏṁṭivo