చెప్పఁగదవే యేల సిగ్గుపడేవు
(॥పల్లవి॥)
చెప్పఁగదవే యేల సిగ్గుపడేవు
కొప్పుజారీ నిన్ను నిట్టే కూడినవాఁడెవ్వఁడే
(॥చెప్ప॥)
నున్ననిచెక్కులమీఁద నూలుకొన్నపులకలు
చన్నులమీఁద నిండినచంద్రవంకలు
కన్నుల కాంక్షలఁ జూచె, కరఁగుల తేటలు-
నెన్నికకెక్కె నీమేన నేడఁ దెచ్చుకొంటివే
(॥చెప్ప॥)
మొగమునఁ గళలతో ముంచెఁ జిరుఁజెమటలు
నిగిడీ నవె ముక్కున నిట్టూరుపులు
చిగురుఁ బెదవిమీఁదఁ జిమ్మిరేఁగె నవ్వులు
మిగులా నున్నవి యెందుఁ దగిలించుకొంటివే
(॥చెప్ప॥)
అలవొకగానే మించె అడుగులఁ దడబాటు
నిలిచిననిలువున నివ్వెరగులు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుమైఁ
గలసిరులు నీవెట్లు గలిగించుకొంటివే
(||pallavi||)
sĕppam̐gadave yela siggubaḍevu
kŏppujārī ninnu niṭṭe kūḍinavām̐ḍĕvvam̐ḍe
(||sĕppa||)
nunnanisĕkkulamīm̐da nūlugŏnnabulagalu
sannulamīm̐da niṁḍinasaṁdravaṁkalu
kannula kāṁkṣhalam̐ jūsĕ, karam̐gula teḍalu-
nĕnnigagĕkkĕ nīmena neḍam̐ dĕchchugŏṁṭive
(||sĕppa||)
mŏgamunam̐ gaḽalado muṁchĕm̐ jirum̐jĕmaḍalu
nigiḍī navĕ mukkuna niṭṭūrubulu
sigurum̐ bĕdavimīm̐dam̐ jimmirem̐gĕ navvulu
migulā nunnavi yĕṁdum̐ dagiliṁchugŏṁṭive
(||sĕppa||)
alavŏgagāne miṁchĕ aḍugulam̐ daḍabāḍu
nilisinaniluvuna nivvĕragulu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhumaim̐
galasirulu nīvĕṭlu galigiṁchugŏṁṭive