చెప్పఁగదవయ్యా చెవులుచల్లఁగా వినే
(॥పల్లవి॥)
చెప్పఁగదవయ్యా చెవులుచల్లఁగా వినే
దెప్పరపుఁ దలపోఁతే దిష్టమాయనో
(॥॥)
తిలకించి యాపె నీదిక్కు చూచితే నీవు
నెలవి నవ్వితి విట్టె సిగ్గుతోడను
యెలమిఁ దనమాటున నేమైనాఁ జేసితివో
చలివేఁడివలపులు సరివచ్చేనో
(॥॥)
విన్నపము లేకతాన వెలఁది నీకుఁ జేయఁగా
సన్నల జంకించితివి సరసానను
కన్నె యెవ్వతైనా వచ్చి కాచుకున్నదనేనో
నున్ననినీచెక్కు దననోరు సోఁకింపించెనో
(॥॥)
జవ్వని నీకాఁగిటను చన్నుల నొత్తితే నీవు
పువ్వుల వేసితివి నీపొందు చూపుచు
రవ్వగా శ్రీ వేంకటేశ రతి నలయించెనో
నివ్వటిల్లఁ జక్కఁగాను నిన్ను నెచ్చరించెనో
(||pallavi||)
sĕppam̐gadavayyā sĕvulusallam̐gā vine
dĕpparabum̐ dalabom̐te diṣhṭamāyano
(||||)
tilagiṁchi yābĕ nīdikku sūside nīvu
nĕlavi navvidi viṭṭĕ siggudoḍanu
yĕlamim̐ danamāḍuna nemainām̐ jesidivo
salivem̐ḍivalabulu sarivachcheno
(||||)
vinnabamu legadāna vĕlam̐di nīgum̐ jeyam̐gā
sannala jaṁkiṁchidivi sarasānanu
kannĕ yĕvvadainā vachchi kāsugunnadaneno
nunnaninīsĕkku dananoru som̐kiṁpiṁchĕno
(||||)
javvani nīgām̐giḍanu sannula nŏttide nīvu
puvvula vesidivi nībŏṁdu sūbusu
ravvagā śhrī veṁkaḍeśha radi nalayiṁchĕno
nivvaḍillam̐ jakkam̐gānu ninnu nĕchchariṁchĕno