Seppamgadare yeemaada seluvunigi

చెప్పఁగదరే యీమాట చెలువునికి
Language

(॥పల్లవి॥)
చెప్పఁగదరే యీమాట చెలువునికి
ఇప్పుడు తన వుంగర మిదె నాచే నున్నది

(॥చెప్ప॥)
బాసలు సేయఁగనేల బయలీఁదించఁగనేల
ఆసకొలిపి నామగఁడైనాఁడు తాను
వేసాలు నేనేమీనేర వెక్కసము లాడనేర
సేసపా లివిగో నా శిరసుపై నున్నవి

(॥చెప్ప॥)
చెక్కులు నొక్కఁగనేల సిగ్గు విడిపించనేల
వొక్కటై నాయింటిలోన నున్నాఁడు తాను
పక్కనఁదన్నుఁ దడవ పాడిపంతాలు దడవ
చక్కగాఁ దన ముద్రలు చన్నులపై నున్నవి

(॥చెప్ప॥)
కలువల వేయనేల కడు వేఁడుకొననేల
నలి శ్రీవేంకటేశుఁడు నన్నేలెఁ దాను
బలుములు చూపవద్దు పట్టి పెనఁగఁగవద్దు
చలఁగి తనసుద్దులు చిత్తములో నున్నవి

(||pallavi||)
sĕppam̐gadare yīmāḍa sĕluvunigi
ippuḍu tana vuṁgara midĕ nāse nunnadi

(||sĕppa||)
bāsalu seyam̐ganela bayalīm̐diṁcham̐ganela
āsagŏlibi nāmagam̐ḍainām̐ḍu tānu
vesālu nenemīnera vĕkkasamu lāḍanera
sesabā livigo nā śhirasubai nunnavi

(||sĕppa||)
sĕkkulu nŏkkam̐ganela siggu viḍibiṁchanela
vŏkkaḍai nāyiṁṭilona nunnām̐ḍu tānu
pakkanam̐dannum̐ daḍava pāḍibaṁtālu daḍava
sakkagām̐ dana mudralu sannulabai nunnavi

(||sĕppa||)
kaluvala veyanela kaḍu vem̐ḍugŏnanela
nali śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕm̐ dānu
balumulu sūbavaddu paṭṭi pĕnam̐gam̐gavaddu
salam̐gi tanasuddulu sittamulo nunnavi