చెప్పఁగదరా నాతో సిగ్గువడక
(॥పల్లవి॥)
చెప్పఁగదరా నాతో సిగ్గువడక
చొప్పులెత్తి చొప్పులెత్తి సొలసి యేమనెరా
(॥చెప్ప॥)
పంతాన మాయింటికి పలుమారు రాఁగాను
యింతి నీ మొగము చూచి యేమనెరా
చెంతల నేఁ డప్పటి నీచెక్కుల రేకలు చూచి
మంతనానఁ జెవిలోన మఱియు నేమనెరా
(॥చెప్ప॥)
చెచ్చెర నీవు నాచేతికి లోనైవుండఁగా
యెచ్చుకుందులాడి యాపె యేమనెరా
పచ్చిచెమటలమేను బాఁతిపడి కాఁగిలించి
విచ్చనవిడిచి నీతో వెంగేన నేమనెరా
(॥చెప్పఁ॥)
మఱఁగులేక నీవు నామంచముపై నుండఁగాను
యెఱిఁగి కొసరి నిన్ను నేమనెరా
యెఱుకతో శ్రీవేంకటేశ యేలితి విద్దరి
జఱసి నిన్ను మెచ్చి సమ్మతించేమనెరా
(||pallavi||)
sĕppam̐gadarā nādo sigguvaḍaga
sŏppulĕtti sŏppulĕtti sŏlasi yemanĕrā
(||sĕppa||)
paṁtāna māyiṁṭigi palumāru rām̐gānu
yiṁti nī mŏgamu sūsi yemanĕrā
sĕṁtala nem̐ ḍappaḍi nīsĕkkula regalu sūsi
maṁtanānam̐ jĕvilona maṟiyu nemanĕrā
(||sĕppa||)
sĕchchĕra nīvu nāsedigi lonaivuṁḍam̐gā
yĕchchuguṁdulāḍi yābĕ yemanĕrā
pachchisĕmaḍalamenu bām̐tibaḍi kām̐giliṁchi
vichchanaviḍisi nīdo vĕṁgena nemanĕrā
(||sĕppam̐||)
maṟam̐gulega nīvu nāmaṁchamubai nuṁḍam̐gānu
yĕṟim̐gi kŏsari ninnu nemanĕrā
yĕṟugado śhrīveṁkaḍeśha yelidi viddari
jaṟasi ninnu mĕchchi sammadiṁchemanĕrā