Seppamga raa dee valabulu selivala nevvarim gaanamu

చెప్పఁగ రా దీ వలపులు చెలివల నెవ్వరిఁ గానము
Language

(॥పల్లవి॥)
చెప్పఁగ రా దీ వలపులు చెలివల నెవ్వరిఁ గానము
ముప్పిరి జవ్వనభారపు ముంభారము గాఁబోలు

(॥చెపఁగ॥)
కన్నుల నిద్దుర దొట్టి కాయము విరివిరిఁ బోయీ
పన్నిన సతిరతి రాతిరి బడలికె గాఁబోలు
కిన్నెర మీటిన నులికి కిమ్ముల నూరకె పలికి
వన్నెల నాతనితో కళవళ మిది గాఁబోలు

(॥చెపఁగ॥)
చెక్కులఁ జెమటలు గారి చింతలు మనసునఁ బేరి
గక్కున మర్మము లంటిన కరఁగులు గాఁబోలు
తక్కక నివ్వెఱఁగంది తలఁచుక తలఁచుక నవ్వి
పక్కన నాతనిఁ బొందినభ్రమ యిది గాఁబోలు

(॥చెపఁగ॥)
దావతి నూర్పులు నించి తలగడ గౌఁగిటఁ జేర్చి
భావజుగరిడిని సాములభ్రమ యిది గాఁబోలు
రే వగ లిది యని యెఱుఁగదిరెట్టించెను కళ లిన్నిటా
శ్రీవేంకటేశుఁడు గూడిన చెలువము గాఁబోలు

(||pallavi||)
sĕppam̐ga rā dī valabulu sĕlivala nĕvvarim̐ gānamu
muppiri javvanabhārabu muṁbhāramu gām̐bolu

(||sĕbam̐ga||)
kannula niddura dŏṭṭi kāyamu virivirim̐ boyī
pannina sadiradi rādiri baḍaligĕ gām̐bolu
kinnĕra mīḍina nuligi kimmula nūragĕ paligi
vannĕla nādanido kaḽavaḽa midi gām̐bolu

(||sĕbam̐ga||)
sĕkkulam̐ jĕmaḍalu gāri siṁtalu manasunam̐ beri
gakkuna marmamu laṁṭina karam̐gulu gām̐bolu
takkaga nivvĕṟam̐gaṁdi talam̐suga talam̐suga navvi
pakkana nādanim̐ bŏṁdinabhrama yidi gām̐bolu

(||sĕbam̐ga||)
dāvadi nūrbulu niṁchi talagaḍa gaum̐giḍam̐ jersi
bhāvajugariḍini sāmulabhrama yidi gām̐bolu
re vaga lidi yani yĕṟum̐gadirĕṭṭiṁchĕnu kaḽa linniḍā
śhrīveṁkaḍeśhum̐ḍu gūḍina sĕluvamu gām̐bolu