చెప్పఁగ నేఁటికి చెలి మనతోడ
(॥పల్లవి॥)
చెప్పఁగ నేఁటికి చెలి మనతోడ
కప్పెఁ జింతలవె కానఁగరాదా
(॥చెప్ప॥)
తలఁపులోపలి తమకమెల్లాను
సెలవినవ్వులఁ జిందీఁ గదే
కొలఁది మీరిన కోరికలప్పటి
మొలకపులక మొత్తములాయ
(॥చెప్ప॥)
వినుకలి తన విరహమెల్లాను
కనుఁగొనలనే కమ్మీఁ గదే
చనవుల తన సరసమప్పటి
ననుపుమాటల నటనలాయ
(॥చెప్ప॥)
గక్కనఁ గూడిన కందువలెల్లాను
మిక్కిలి మోవిపై మించెఁ గదే
యెక్కువ శ్రీ వేంకటేశు మేలప్పటి
వొక్కటై పాయని వొద్దికలాయ
(||pallavi||)
sĕppam̐ga nem̐ṭigi sĕli manadoḍa
kappĕm̐ jiṁtalavĕ kānam̐garādā
(||sĕppa||)
talam̐pulobali tamagamĕllānu
sĕlavinavvulam̐ jiṁdīm̐ gade
kŏlam̐di mīrina korigalappaḍi
mŏlagabulaga mŏttamulāya
(||sĕppa||)
vinugali tana virahamĕllānu
kanum̐gŏnalane kammīm̐ gade
sanavula tana sarasamappaḍi
nanubumāḍala naḍanalāya
(||sĕppa||)
gakkanam̐ gūḍina kaṁduvalĕllānu
mikkili movibai miṁchĕm̐ gade
yĕkkuva śhrī veṁkaḍeśhu melappaḍi
vŏkkaḍai pāyani vŏddigalāya