చెప్పఁబోతేఁ బస లేదు శ్రీపతిదాసులు నన్ను
(॥పల్లవి॥)
చెప్పఁబోతేఁ బస లేదు శ్రీపతిదాసులు నన్ను
తప్పక చేపట్టితేనే ధన్యుఁడ నే నైతిని
(॥చెప్ప॥)
భ్రమసి పొరలదోలు పై వేసుకొన్నవాఁడ
యెముకల యింటిలో ఇరవైనాఁడ
తమితోడ మలమూత్రతిత్తులఁ బాయనివాఁడ
అమర మా కులగ్రోత మడుగ నేమిటికి
(॥చెప్ప॥)
పుట్టిన చోటడిగితే పూఁచి చెప్పరానివాఁడ
ముట్టరానిచోటనే మునిఁగేవాఁడ
చుట్టుకొన్న వెంట్రుకల జూబులకొప్పువాఁడ
లెట్టి మా యిల్లువరు వెదక నేమిటికి
(॥చెప్ప॥)
నానుచున్న నోరిలోని నరాల నాలికవాఁడ
యే నిజమూ నెఱుఁగని యెడ్డవాఁడనూ
లోనుండి శ్రీవేంకటాద్రి లోకేశుఁడు నన్ను నేలె
తానకపు మా గుట్టు తలఁచ నేమిటికి
(||pallavi||)
sĕppam̐bodem̐ basa ledu śhrībadidāsulu nannu
tappaga sebaṭṭidene dhanyum̐ḍa ne naidini
(||sĕppa||)
bhramasi pŏraladolu pai vesugŏnnavām̐ḍa
yĕmugala yiṁṭilo iravainām̐ḍa
tamidoḍa malamūtradittulam̐ bāyanivām̐ḍa
amara mā kulagroda maḍuga nemiḍigi
(||sĕppa||)
puṭṭina soḍaḍigide pūm̐si sĕpparānivām̐ḍa
muṭṭarānisoḍane munim̐gevām̐ḍa
suṭṭugŏnna vĕṁṭrugala jūbulagŏppuvām̐ḍa
lĕṭṭi mā yilluvaru vĕdaga nemiḍigi
(||sĕppa||)
nānusunna noriloni narāla nāligavām̐ḍa
ye nijamū nĕṟum̐gani yĕḍḍavām̐ḍanū
lonuṁḍi śhrīveṁkaḍādri logeśhum̐ḍu nannu nelĕ
tānagabu mā guṭṭu talam̐sa nemiḍigi