చెప్పఁబోతే నవ్వువచ్చీఁ జెల్లబో నాకు
(॥పల్లవి॥)
చెప్పఁబోతే నవ్వువచ్చీఁ జెల్లబో నాకు
తప్పులౌనో వొప్పులౌనో తడవఁగ నోపనే
(॥చెప్ప॥)
యెన్ని మారులు చెప్పెంపీ నేకతము గలదంటా
నిన్నటి మాటలే కా నేఁడాడేవి
తన్నుఁదానే యాడుకొని తనిసితి నన్నిటాను
విన్నదానఁ దొల్లే తనవిచారములెల్లను
(॥చెప॥)
గొడవ లడువఁగానే కొంగువట్టి తీసీని
వడిఁ దొల్లి తీసినవి వడ్డివారీని
నడుమ నడుమనేల నయములుఁ బ్రియములు
వడిఁబడు నిఁకమీఁద వలపు చల్లినను
(॥చెప్ప॥)
కదిసి కదిసి నన్నుఁ గాఁగిటినె బిగియించి
మది గలిగీనింతే కా మంగళమిది
అదన శ్రీవెంకటేశుఁ డలమేలుమంగను న-
న్నుదుటను గూడెఁ దలఁపొక్కటాయనిపుడు
(||pallavi||)
sĕppam̐bode navvuvachchīm̐ jĕllabo nāgu
tappulauno vŏppulauno taḍavam̐ga nobane
(||sĕppa||)
yĕnni mārulu sĕppĕṁpī negadamu galadaṁṭā
ninnaḍi māḍale kā nem̐ḍāḍevi
tannum̐dāne yāḍugŏni tanisidi nanniḍānu
vinnadānam̐ dŏlle tanavisāramulĕllanu
(||sĕba||)
gŏḍava laḍuvam̐gāne kŏṁguvaṭṭi tīsīni
vaḍim̐ dŏlli tīsinavi vaḍḍivārīni
naḍuma naḍumanela nayamulum̐ briyamulu
vaḍim̐baḍu nim̐kamīm̐da valabu sallinanu
(||sĕppa||)
kadisi kadisi nannum̐ gām̐giḍinĕ bigiyiṁchi
madi galigīniṁte kā maṁgaḽamidi
adana śhrīvĕṁkaḍeśhum̐ ḍalamelumaṁganu na-
nnuduḍanu gūḍĕm̐ dalam̐pŏkkaḍāyanibuḍu