Seppambode danadonu siggayyee naagu

చెప్పఁబోతే దనతోను సిగ్గయ్యీ నాకు
Language

(॥పల్లవి॥)
చెప్పఁబోతే దనతోను సిగ్గయ్యీ నాకు
యిప్పుడు వద్ద నున్నాఁడు యెచ్చరించరే

(॥చెప్ప॥)
చూడఁగానె నా కన్నులు సొరిదిఁ జేరఁడే సాయ
యిడఁ దన చక్కఁదన మెంతో కాని
దాడితో నెడతెగదు తనమీఁది తలపోఁత
వేడుకకు వెల లేదు విన్నవించరే

(॥చెప్ప॥)
కదిసితే నా చన్నులు కాఁగెఁడేసి కాఁబెరిగె
యిదివో తనభారము యెంతో కాని
వొదగాయఁ దనమీఁద నుదు టైనతమకము
యెదుట నా మోహ మెల్ల నెరిఁగించరే

(॥చెప్ప॥)
పైఁకొనఁగ నాతురుము బారెఁడేసి కొన సాగె
యీ కొలది తననేర్పు యిటు సేసెను
దాకొని శ్రీవెంకటేశు తగు లైనకూటమి
మేకొని నామారు మీరు మెచ్చఁ గదరే

(||pallavi||)
sĕppam̐bode danadonu siggayyī nāgu
yippuḍu vadda nunnām̐ḍu yĕchchariṁchare

(||sĕppa||)
sūḍam̐gānĕ nā kannulu sŏridim̐ jeram̐ḍe sāya
yiḍam̐ dana sakkam̐dana mĕṁto kāni
dāḍido nĕḍadĕgadu tanamīm̐di talabom̐ta
veḍugagu vĕla ledu vinnaviṁchare

(||sĕppa||)
kadiside nā sannulu kām̐gĕm̐ḍesi kām̐bĕrigĕ
yidivo tanabhāramu yĕṁto kāni
vŏdagāyam̐ danamīm̐da nudu ṭainadamagamu
yĕduḍa nā moha mĕlla nĕrim̐giṁchare

(||sĕppa||)
paim̐kŏnam̐ga nādurumu bārĕm̐ḍesi kŏna sāgĕ
yī kŏladi tananerbu yiḍu sesĕnu
dāgŏni śhrīvĕṁkaḍeśhu tagu lainagūḍami
megŏni nāmāru mīru mĕchcham̐ gadare