Seppam gottalai vunnavi semdi nee maigurudulu

చెప్పఁ గొత్తలై వున్నవి చెంది నీ మైగురుతులు
Language

(॥పల్లవి॥)
చెప్పఁ గొత్తలై వున్నవి చెంది నీ మైగురుతులు
చొప్పు లెత్తఁగా నీ మనసున నెట్టుండునో

(॥॥)
వెన్నెల బాయిట నీవు వేఁగినంత నుండఁగానో
సన్నపుఁ జంద్రులు నీ మై జాజుకొనేను
పన్నీరు దప్పికి నీవు పలుమారుఁ గొనఁగానో
చిన్ని చెమట చెక్కులఁ జిందఁగఁ దొడఁగెను

(॥॥)
పలుమారు వనములోఁ బాయక వుండఁగానో
చిలుక వొట్లు మోవిఁ జెలరేఁగెను
అల గాలిమండపమునందు నిద్దిరించగానో
పొలసి నిట్టూరుపుల బుసకొట్టే విపుడు

(॥॥)
గరిడి సాములు నీవు గనముగఁ జేయఁగానో
కురులు చెదరి కడుఁగొప్పు వీడెను
యిరవై శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడితివి
కరుణ నన్నేలఁగానో కళ లెల్లా నిండెనూ

(||pallavi||)
sĕppam̐ gŏttalai vunnavi sĕṁdi nī maigurudulu
sŏppu lĕttam̐gā nī manasuna nĕṭṭuṁḍuno

(||||)
vĕnnĕla bāyiḍa nīvu vem̐ginaṁta nuṁḍam̐gāno
sannabum̐ jaṁdrulu nī mai jājugŏnenu
pannīru dappigi nīvu palumārum̐ gŏnam̐gāno
sinni sĕmaḍa sĕkkulam̐ jiṁdam̐gam̐ dŏḍam̐gĕnu

(||||)
palumāru vanamulom̐ bāyaga vuṁḍam̐gāno
siluga vŏṭlu movim̐ jĕlarem̐gĕnu
ala gālimaṁḍabamunaṁdu niddiriṁchagāno
pŏlasi niṭṭūrubula busagŏṭṭe vibuḍu

(||||)
gariḍi sāmulu nīvu ganamugam̐ jeyam̐gāno
kurulu sĕdari kaḍum̐gŏppu vīḍĕnu
yiravai śhrī veṁkaḍeśha yīḍa nannum̐ gūḍidivi
karuṇa nannelam̐gāno kaḽa lĕllā niṁḍĕnū