Seppam gottalaayam gade seliya nee suddulellaa

చెప్పఁ గొత్తలాయఁ గదె చెలియ నీ సుద్దులెల్లా
Language

(॥పల్లవి॥)
చెప్పఁ గొత్తలాయఁ గదె చెలియ నీ సుద్దులెల్లా
ముప్పిరిగొన్న వలపు మూల దాఁచ నేఁటికి

(॥చెప్పఁ॥)
చనుఁగొండల మీఁదట చఁదోదయములాయ
ఘనముగా వెన్నెలలే కాయవుగాని
పెనగొన్న చిగురుపై పెనువాన లుప్పతిలె
యెనసియు వాడుదేరదేయోకాని

(॥చెప్పఁ॥)
అంచెలఁ జీఁకటితీగె లటునిటు నిండుకొనె
కొంచించక యట్టె పొద్దు గుంకదుగాని
పొంచి కెందామరలు గొబ్బున వికసించెను
ముంచుకొని తుమ్మిదలే మూఁగవుగాని

(॥చెప్పఁ॥)
గక్కన నద్దములోనఁ గళలు మెరువఁ జొచ్చె
వుక్కుమీరి మేఘము లెందున్నవోకాని
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డిఁతలోనె నిన్ను నేలె
పక్కన మరుఁడే నీకుఁ బంత్తమిచ్చెఁగాని

(||pallavi||)
sĕppam̐ gŏttalāyam̐ gadĕ sĕliya nī suddulĕllā
muppirigŏnna valabu mūla dām̐sa nem̐ṭigi

(||sĕppam̐||)
sanum̐gŏṁḍala mīm̐daḍa sam̐dodayamulāya
ghanamugā vĕnnĕlale kāyavugāni
pĕnagŏnna sigurubai pĕnuvāna luppadilĕ
yĕnasiyu vāḍuderadeyogāni

(||sĕppam̐||)
aṁchĕlam̐ jīm̐kaḍidīgĕ laḍuniḍu niṁḍugŏnĕ
kŏṁchiṁchaga yaṭṭĕ pŏddu guṁkadugāni
pŏṁchi kĕṁdāmaralu gŏbbuna vigasiṁchĕnu
muṁchugŏni tummidale mūm̐gavugāni

(||sĕppam̐||)
gakkana naddamulonam̐ gaḽalu mĕruvam̐ jŏchchĕ
vukkumīri meghamu lĕṁdunnavogāni
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍim̐talonĕ ninnu nelĕ
pakkana marum̐ḍe nīgum̐ baṁttamichchĕm̐gāni