Seppam golamdulu gaavu seliya simgaaramidi

చెప్పఁ గొలఁదులు గావు చెలియ సింగారమిది
Language

(॥పల్లవి॥)
చెప్పఁ గొలఁదులు గావు చెలియ సింగారమిది
చొప్పుగా నిందరికి సూచనై నిలిచె

(॥॥)
వెలఁది కుచముల మీఁద వెలి పెంపుపయ్య దిదె
యెలమి బోలింపరే యెట్లున్నది
కులికి పతిఁ గలియచోఁ గురియుఁ జెమటలజడికి
మెలఁగి కొండల మొయిలు మేసినట్లాయ

(॥॥)
సుదతి నెన్నుదుటిపై జూడఁ గుంకుమ బొట్టు
యెదుటఁ బొలింపరే యెట్లున్నది
కదిసి తన నాయకునిఁ గలసినప్పటి వేళ
మదనరాగం బిపుడె మలసినట్లాయ

(॥॥)
సతితురుములో విరులు జారి పైరాలె నిదె
యితరులకు బోలించ నెట్లున్నది
యితవుగా శ్రీవేంకటేశు గూడిన ఇపుడు
చతురతలఁ బై సేస చల్లినట్లాయ

(||pallavi||)
sĕppam̐ gŏlam̐dulu gāvu sĕliya siṁgāramidi
sŏppugā niṁdarigi sūsanai nilisĕ

(||||)
vĕlam̐di kusamula mīm̐da vĕli pĕṁpubayya didĕ
yĕlami boliṁpare yĕṭlunnadi
kuligi padim̐ galiyasom̐ guriyum̐ jĕmaḍalajaḍigi
mĕlam̐gi kŏṁḍala mŏyilu mesinaṭlāya

(||||)
sudadi nĕnnuduḍibai jūḍam̐ guṁkuma bŏṭṭu
yĕduḍam̐ bŏliṁpare yĕṭlunnadi
kadisi tana nāyagunim̐ galasinappaḍi veḽa
madanarāgaṁ bibuḍĕ malasinaṭlāya

(||||)
sadidurumulo virulu jāri pairālĕ nidĕ
yidarulagu boliṁcha nĕṭlunnadi
yidavugā śhrīveṁkaḍeśhu gūḍina ibuḍu
saduradalam̐ bai sesa sallinaṭlāya