Seppaguve nee suddulu seluladonu

చెప్పకువే నీ సుద్దులు చెలులతోను
Language

(॥పల్లవి॥)
చెప్పకువే నీ సుద్దులు చెలులతోను
ఇప్పుడిట్టె సవతుల మెంత సేయనేరమే

(॥చెప్ప॥)
మగఁడు మన్నించఁగాఁనే మంతు కెక్కె నీమాటలు
సగియించకుంటేను చవివుట్టీనా
మొగమోట గలుగఁగా ముసిముసినవ్వు వచ్చె
యెగసక్కేలై తేను యెనసీనా పొందులు

(॥చెప్ప॥)
సరస మాతఁ డాడఁగాసలిగె పనికివచ్చె
పరాకుసేసుకుండితే బాఁతెయ్యీనా
పరగఁ గూడరాఁగానే పంతమెల్లా నీడేరె
విరహము రేఁచితేను వేడుక వుట్టీనా

(॥చెప్ప॥)
శ్రీవేంకటేశుఁడు దొరఁ జేయఁగా నన్నీ నమరె
కైవసము గాకుండితే కాఁకదేరీనా
యీవల నన్నేలఁగానే యిన్నీఁదారుకాణవచ్చె
భావ మెఱఁగకుండితే పగటు చూపట్టునా

(||pallavi||)
sĕppaguve nī suddulu sĕluladonu
ippuḍiṭṭĕ savadula mĕṁta seyanerame

(||sĕppa||)
magam̐ḍu manniṁcham̐gām̐ne maṁtu kĕkkĕ nīmāḍalu
sagiyiṁchaguṁṭenu savivuṭṭīnā
mŏgamoḍa galugam̐gā musimusinavvu vachchĕ
yĕgasakkelai tenu yĕnasīnā pŏṁdulu

(||sĕppa||)
sarasa mādam̐ ḍāḍam̐gāsaligĕ panigivachchĕ
parāgusesuguṁḍide bām̐tĕyyīnā
paragam̐ gūḍarām̐gāne paṁtamĕllā nīḍerĕ
virahamu rem̐sidenu veḍuga vuṭṭīnā

(||sĕppa||)
śhrīveṁkaḍeśhum̐ḍu dŏram̐ jeyam̐gā nannī namarĕ
kaivasamu gāguṁḍide kām̐kaderīnā
yīvala nannelam̐gāne yinnīm̐dārugāṇavachchĕ
bhāva mĕṟam̐gaguṁḍide pagaḍu sūbaṭṭunā