Seppagure yaa suddulu selulaala

చెప్పకురే యా సుద్దులు చెలులాల
Language

(॥పల్లవి॥)
చెప్పకురే యా సుద్దులు చెలులాల
యెప్పుడుఁ గలవే కావా యీవినోదములు

(॥చెప్పి॥)
యెంచ దానివెంగెములు యేసవతు లాడినాను
మంచిమాఁట లాడితేను మతి గరఁగు
వంచనతో విభుడు నావసమై వున్న వాఁడు
అంచెలఁ దా మేమాడినా నందు కేమాయనే

(॥చెప్పి॥)
కాతరించి వాదులకుఁ గదియ నుంకించినాను
చేతులెత్తి మొక్కితేనే చింత దీరును
ఆతుమై యాతఁడు నాయండ వాయకున్న వాఁడు
యేతులఁ దా మెట్టుండినా నేపనికి వచ్చునే

(॥చెప్పి॥)
మచ్చరించి తమ్ముఁదామె మతి నుడికిపడిన
యిచ్చగించి నవ్వితేనే యీసుదీరునే
యిచ్చట శ్రీవేంకటేశుఁ డిదివో నన్నుఁ గూడె
యిచ్చకము తా మాటాడితే నేనునఁగవచ్చునే

(||pallavi||)
sĕppagure yā suddulu sĕlulāla
yĕppuḍum̐ galave kāvā yīvinodamulu

(||sĕppi||)
yĕṁcha dānivĕṁgĕmulu yesavadu lāḍinānu
maṁchimām̐ṭa lāḍidenu madi garam̐gu
vaṁchanado vibhuḍu nāvasamai vunna vām̐ḍu
aṁchĕlam̐ dā memāḍinā naṁdu kemāyane

(||sĕppi||)
kādariṁchi vādulagum̐ gadiya nuṁkiṁchinānu
sedulĕtti mŏkkidene siṁta dīrunu
ādumai yādam̐ḍu nāyaṁḍa vāyagunna vām̐ḍu
yedulam̐ dā mĕṭṭuṁḍinā nebanigi vachchune

(||sĕppi||)
machchariṁchi tammum̐dāmĕ madi nuḍigibaḍina
yichchagiṁchi navvidene yīsudīrune
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍidivo nannum̐ gūḍĕ
yichchagamu tā māḍāḍide nenunam̐gavachchune