చెప్పకురే బుద్దులిఁకఁ జెలులాల
(॥పల్లవి॥)
చెప్పకురే బుద్దులిఁకఁ జెలులాల
చిప్పిల నాతనికే సెలవు నా వయసు
(॥॥)
చెప్పరాని మాటలకు చెవులొగ్గి విననేల
తప్పులెంచే పనులై తే తాఁ జేయనేల
వొప్పుగా నెప్పుడూఁ బతివొద్ద నిట్టే వుండఁగాను
అప్పటికప్పటి భోగమైనంతే చాలును
(॥॥)
వోపలేని భారము వొడిఁగట్టుకోనేల
కైపైన వేడుకలు గైకొననేల
చేపట్టినాతనికి సేవ సేసుకుండఁగాను
చూపుల నాతఁడు దయఁ జూచినదే చాలును
(॥॥)
చప్పని మాటలు మరి సారె సారె నాడనేల
వుప్పతించి పంతములు నొరయనేల
యిప్పుడు శ్రీవేంకటేశుఁ డిట్టె కూడి వుండఁగాను
కప్పి సంతోసించిన యీకందువిదే చాలును
(||pallavi||)
sĕppagure buddulim̐kam̐ jĕlulāla
sippila nādanige sĕlavu nā vayasu
(||||)
sĕpparāni māḍalagu sĕvulŏggi vinanela
tappulĕṁche panulai te tām̐ jeyanela
vŏppugā nĕppuḍūm̐ badivŏdda niṭṭe vuṁḍam̐gānu
appaḍigappaḍi bhogamainaṁte sālunu
(||||)
vobaleni bhāramu vŏḍim̐gaṭṭugonela
kaibaina veḍugalu gaigŏnanela
sebaṭṭinādanigi seva sesuguṁḍam̐gānu
sūbula nādam̐ḍu dayam̐ jūsinade sālunu
(||||)
sappani māḍalu mari sārĕ sārĕ nāḍanela
vuppadiṁchi paṁtamulu nŏrayanela
yippuḍu śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ kūḍi vuṁḍam̐gānu
kappi saṁtosiṁchina yīgaṁduvide sālunu