చెప్పకురే అంత మీరు చెలువుని గుణములు
(॥పల్లవి॥)
చెప్పకురే అంత మీరు చెలువుని గుణములు
తిప్పరాని మగవానితీరు లివెకాక
(॥చెప్ప॥)
అతిమోహమే కలితే ఆడికకు వెఱచునా
చతురునిప్రియమెల్ల సటలుగాక
యితవే కలిగితేను యెగ్గులకు లోఁ గునా
మతకాన నవి గొన్ని మాయలుగాక
(॥చెప్ప॥)
మనసులే యేకమైతే మారుమాట లాడునా
వినయములెల్లాను వేసాలుగాక
తనతమే నిజమైతే తనివి గలుగునా
ననుపుగా నాఁ టకము నడపీఁ గాక
(॥చెప్ప॥)
తానే నన్నేలకుండితే దగ్గరి వూరకుండునా
నానఁ బెట్టి యిందిరిలో నవ్వులుగాక
యీనెపాన శ్రీవెంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
కానవచ్చెఁ దొంటివెల్లాఁ గత లింతేకాక
(||pallavi||)
sĕppagure aṁta mīru sĕluvuni guṇamulu
tipparāni magavānidīru livĕgāga
(||sĕppa||)
adimohame kalide āḍigagu vĕṟasunā
sadurunipriyamĕlla saḍalugāga
yidave kaligidenu yĕggulagu lom̐ gunā
madagāna navi gŏnni māyalugāga
(||sĕppa||)
manasule yegamaide mārumāḍa lāḍunā
vinayamulĕllānu vesālugāga
tanadame nijamaide tanivi galugunā
nanubugā nām̐ ṭagamu naḍabīm̐ gāga
(||sĕppa||)
tāne nannelaguṁḍide daggari vūraguṁḍunā
nānam̐ bĕṭṭi yiṁdirilo navvulugāga
yīnĕbāna śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
kānavachchĕm̐ dŏṁṭivĕllām̐ gada liṁtegāga