Seppagunna dosamu semta lerimginavaaru

చెప్పకున్న దోసము చేఁత లెరిఁగినవారు
Language

(॥పల్లవి॥)
చెప్పకున్న దోసము చేఁత లెరిఁగినవారు
కప్పిన సంతోసాలఁ గందువ లెరఁగరు

(॥చెప్ప॥)
కన్నెలాల మీరిద్దరు కాఁగిలించేరు చుట్టాలై
పిన్నలు చన్నులొత్తీనే పెరిగేపొద్దు
మున్నాడి యొక్కరొక్కరు మొక్కలాడేరప్పటిని
కన్నచో గోళ్ళుదాఁకీనే కడువాఁడిపొద్దు

(॥చెప్ప॥)
దిట్టలై ముచ్చటలుగా తీపులు మాటలాడేరు
యిట్టె తేనెగారీ నిప్పలెర్లించే(?) పొద్దు
చెట్టపట్టాలు వట్టేరు చేరి పిరుఁదులురాయ
బట్టబయలయ్యా మరుబండ్లు వారేపొద్దు

(॥చెప్ప॥)
బంతినే మీరిద్దరును పాదుగాఁ గూచుండేరు
గుంతలయ్యీఁ బరపల్లాఁ గూడేటిపొద్దు
యింతలో శ్రీవేంకటేశుఁడెనసె నిన్నునూ నన్నూ
రంతుగా మాచేనాడించే రాజసమీపొద్దు

(||pallavi||)
sĕppagunna dosamu sem̐ta lĕrim̐ginavāru
kappina saṁtosālam̐ gaṁduva lĕram̐garu

(||sĕppa||)
kannĕlāla mīriddaru kām̐giliṁcheru suṭṭālai
pinnalu sannulŏttīne pĕrigebŏddu
munnāḍi yŏkkarŏkkaru mŏkkalāḍerappaḍini
kannaso goḽḽudām̐kīne kaḍuvām̐ḍibŏddu

(||sĕppa||)
diṭṭalai muchchaḍalugā tībulu māḍalāḍeru
yiṭṭĕ tenĕgārī nippalĕrliṁche(?) pŏddu
sĕṭṭabaṭṭālu vaṭṭeru seri pirum̐dulurāya
baṭṭabayalayyā marubaṁḍlu vārebŏddu

(||sĕppa||)
baṁtine mīriddarunu pādugām̐ gūsuṁḍeru
guṁtalayyīm̐ baraballām̐ gūḍeḍibŏddu
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ḍĕnasĕ ninnunū nannū
raṁtugā māsenāḍiṁche rājasamībŏddu