చెప్పకున్న దోసమూ సేసిన చేఁతలు నీతో
(॥పల్లవి॥)
చెప్పకున్న దోసమూ సేసిన చేఁతలు నీతో
చొప్పెత్తి పయ్యద గంటే సోదించక మానఁడు
(॥చెప్ప॥)
రాఁడని నీతోఁ జెప్ప రాఁగా నీరమణుఁడు
పోఁడిమి గాఁగిటఁ బెట్టెఁ బోకు మంటాను
నాఁడె నీతోఁ జెప్పవా నన్ను నంపకు మనుచు
ఆఁడ దైతేఁ జాలు నాతఁ డంటుకోక మానఁడు
(॥చెప్ప॥)
నీపై నాన వెట్టఁ గానె నీవావి మీఁద వేసి
చేపట్టి గిజిగిజిగాఁ జేసె నాతఁడు
వోప నన్నాఁ బో నీక వూడిగాన కంపితిని
యీపాటి సందు గలితే యెనయక మానఁడు
(॥చెప్ప॥)
నే నట్టె పెనఁగఁ గాను నీమతకమే యంటా
తానే కూడె శ్రీవెంకటోత్తముఁడు నన్ను
మోనాన నూరకుండితి ముందు నిన్నుఁగూడుదాఁకా
నానాటి కీపాటి నవ్వు నడపక మానఁడు
(||pallavi||)
sĕppagunna dosamū sesina sem̐talu nīdo
sŏppĕtti payyada gaṁṭe sodiṁchaga mānam̐ḍu
(||sĕppa||)
rām̐ḍani nīdom̐ jĕppa rām̐gā nīramaṇum̐ḍu
pom̐ḍimi gām̐giḍam̐ bĕṭṭĕm̐ bogu maṁṭānu
nām̐ḍĕ nīdom̐ jĕppavā nannu naṁpagu manusu
ām̐ḍa daidem̐ jālu nādam̐ ḍaṁṭugoga mānam̐ḍu
(||sĕppa||)
nībai nāna vĕṭṭam̐ gānĕ nīvāvi mīm̐da vesi
sebaṭṭi gijigijigām̐ jesĕ nādam̐ḍu
voba nannām̐ bo nīga vūḍigāna kaṁpidini
yībāḍi saṁdu galide yĕnayaga mānam̐ḍu
(||sĕppa||)
ne naṭṭĕ pĕnam̐gam̐ gānu nīmadagame yaṁṭā
tāne kūḍĕ śhrīvĕṁkaḍottamum̐ḍu nannu
monāna nūraguṁḍidi muṁdu ninnum̐gūḍudām̐kā
nānāḍi kībāḍi navvu naḍabaga mānam̐ḍu