Seppagu seppagu naagu seri neevu pachchisesi

చెప్పకు చెప్పకు నాకు చేరి నీవు పచ్చిసేసి
Language

(॥పల్లవి॥)
చెప్పకు చెప్పకు నాకు చేరి నీవు పచ్చిసేసి
చొప్పుగా నీవు చూచిన చూపులే గురుతు

(॥చెప్ప॥)
మోహము గలవారికి మొగచాటు గలదా
దాహపుటడియాసలతము(గు)లే కాక
పోహణించి యేల నాకుఁబుట్టించేవు తరితీపు
యీహల మరునిపూవు టేట్లే గురుతు

(॥చెప్ప॥)
ఇయ్యకోలైనవారికి యెరవులు గలవా
నెయ్యపు సరసములో నేరుపేకాక
వొయ్యనే ఇంతేసి యేల వొప్పగించేవు నీమేలు
ముయ్యక ముందు మొక్కిన మొక్కులే గురుతు

(॥చెప్ప॥)
తగులు గలవారికి తచ్చనలు గలవా
నగిన సెలవులలో ననుపేగాక
అగపడి శ్రీ వేంకటాధిప నన్ను గూడితి
జిగిమీరఁ జేసినట్టి చేఁతలే గుఱుతు

(||pallavi||)
sĕppagu sĕppagu nāgu seri nīvu pachchisesi
sŏppugā nīvu sūsina sūbule gurudu

(||sĕppa||)
mohamu galavārigi mŏgasāḍu galadā
dāhabuḍaḍiyāsaladamu(gu)le kāga
pohaṇiṁchi yela nāgum̐buṭṭiṁchevu taridību
yīhala marunibūvu ṭeṭle gurudu

(||sĕppa||)
iyyagolainavārigi yĕravulu galavā
nĕyyabu sarasamulo nerubegāga
vŏyyane iṁtesi yela vŏppagiṁchevu nīmelu
muyyaga muṁdu mŏkkina mŏkkule gurudu

(||sĕppa||)
tagulu galavārigi tachchanalu galavā
nagina sĕlavulalo nanubegāga
agabaḍi śhrī veṁkaḍādhiba nannu gūḍidi
jigimīram̐ jesinaṭṭi sem̐tale guṟudu