చెప్పకు నీ వోరుపులు సిగ్గు లయ్యీని
(॥పల్లవి॥)
చెప్పకు నీ వోరుపులు సిగ్గు లయ్యీని
కప్పుక రాఁగానె కాక కడుఁ బెలచవు
(॥చెప్పకు॥)
ఆయము దప్పక నిన్ను ఆడ కుండఁగానె కాక
వోయయ్య నీ వింతేసి కోరిచేవా
చాయ సేసుకొని నీతో సరి నవ్వే దెరఁగవు
నీయంతనే వచ్చి నిజము నెరుపేవు
(॥చెప్పకు॥)
సంగడి దప్పి నీపైఁ జేయి చాఁచ కుండఁగానె కాక
యింగితాన నెందు కైన నియ్యకొనేవా
చెంగట నీగుణములు చెల్లఁ బెట్టే దెరఁగవు
ముంగిటిచెలుల కెల్ల ముచ్చట చేప్పేవూ
(॥చెప్పకు॥)
కిమ్ముల బొమ్మలకు జంకించ కుండఁగానె కాక
నెమ్మది నీ దీమసాలు నెరుపేవా
యిమ్ముల శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
సమ్మతించి యిప్పుడు గా చనువు లిచ్చేవూ
(||pallavi||)
sĕppagu nī vorubulu siggu layyīni
kappuga rām̐gānĕ kāga kaḍum̐ bĕlasavu
(||sĕppagu||)
āyamu dappaga ninnu āḍa kuṁḍam̐gānĕ kāga
voyayya nī viṁtesi korisevā
sāya sesugŏni nīdo sari navve dĕram̐gavu
nīyaṁtane vachchi nijamu nĕrubevu
(||sĕppagu||)
saṁgaḍi dappi nībaim̐ jeyi sām̐sa kuṁḍam̐gānĕ kāga
yiṁgidāna nĕṁdu kaina niyyagŏnevā
sĕṁgaḍa nīguṇamulu sĕllam̐ bĕṭṭe dĕram̐gavu
muṁgiḍisĕlula kĕlla muchchaḍa seppevū
(||sĕppagu||)
kimmula bŏmmalagu jaṁkiṁcha kuṁḍam̐gānĕ kāga
nĕmmadi nī dīmasālu nĕrubevā
yimmula śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
sammadiṁchi yippuḍu gā sanuvu lichchevū