చెప్పక నే మెఱఁగము చిత్తము నీదెట్లానో
(॥పల్లవి॥)
చెప్పక నే మెఱఁగము చిత్తము నీదెట్లానో
చెప్పి సేయించుకోవయ్య చేరి వూడిగాలు
(॥చెప్ప॥)
గుఱితాఁకులవలపు కొమ్మచూపుల నున్నది
చిఱునవ్వులవలపు చెక్కుల నదె
తఱచయిన వలపు తగ మోవినున్నది
నెఱయ నేవలపులు నేరిచితివో
(॥చెప్ప॥)
చలమఱివలపులు చనుమొనల నున్నవి
కులుకువలపు గోరికొన నదె
పెలుచువలపులెల్ల పిరుఁదుననే వున్నవి
యెలమి నీ కేవలపు యితవయ్యీనో
(॥చెప్ప॥)
తమకపువలపెల్ల తగుకాఁగిట నున్నవి
గుమురువలపు పెద్దకొప్పున నదె
చెమటతోఁ గూడితివి శ్రీవేంకటేశ్వర చెలి
అమరిన దేవలపు అంటీనో నీకు
(||pallavi||)
sĕppaga ne mĕṟam̐gamu sittamu nīdĕṭlāno
sĕppi seyiṁchugovayya seri vūḍigālu
(||sĕppa||)
guṟidām̐kulavalabu kŏmmasūbula nunnadi
siṟunavvulavalabu sĕkkula nadĕ
taṟasayina valabu taga movinunnadi
nĕṟaya nevalabulu nerisidivo
(||sĕppa||)
salamaṟivalabulu sanumŏnala nunnavi
kuluguvalabu gorigŏna nadĕ
pĕlusuvalabulĕlla pirum̐dunane vunnavi
yĕlami nī kevalabu yidavayyīno
(||sĕppa||)
tamagabuvalabĕlla tagugām̐giḍa nunnavi
gumuruvalabu pĕddagŏppuna nadĕ
sĕmaḍadom̐ gūḍidivi śhrīveṁkaḍeśhvara sĕli
amarina devalabu aṁṭīno nīgu