Seppadu yemtainam jelulagunu

చెప్పదు యెంతైనఁ జెలులకును
Language

(॥పల్లవి॥)
చెప్పదు యెంతైనఁ జెలులకును
చొప్పులెత్తుచును సోదించరాదా

(॥॥)
ననుపున నీ విటు నవ్వులు నవ్వఁగా
మునుకొనె సిగ్గులు ముద్దియకు
మనసునఁబారినమతక మేఁటిదో
అనువున నదియును నడుగఁగరాదా

(॥॥)
పలుమరు నీవిటు పైఁజేయి వేయఁగా
పులకలు నిండెను పొలిఁతికిని
యెలమినిఁ బొడమినయింపు లెట్టివో
తిలకించి అవియుఁ దెలియఁగరాదా

(॥॥)
గక్కన నీ విటు కాఁగిలించఁగా
చొక్కులు మించెను సుదతికిని
యిక్కువలు శ్రీవేంకటేశ యెట్టివో
మిక్కిలి మేలిఁక మెచ్చఁగరాదా

(||pallavi||)
sĕppadu yĕṁtainam̐ jĕlulagunu
sŏppulĕttusunu sodiṁcharādā

(||||)
nanubuna nī viḍu navvulu navvam̐gā
munugŏnĕ siggulu muddiyagu
manasunam̐bārinamadaga mem̐ṭido
anuvuna nadiyunu naḍugam̐garādā

(||||)
palumaru nīviḍu paim̐jeyi veyam̐gā
pulagalu niṁḍĕnu pŏlim̐tigini
yĕlaminim̐ bŏḍaminayiṁpu lĕṭṭivo
tilagiṁchi aviyum̐ dĕliyam̐garādā

(||||)
gakkana nī viḍu kām̐giliṁcham̐gā
sŏkkulu miṁchĕnu sudadigini
yikkuvalu śhrīveṁkaḍeśha yĕṭṭivo
mikkili melim̐ka mĕchcham̐garādā