చెప్పదు మనతో నించుక చెలి విరహపువెఱ్ఱిది యని
(॥పల్లవి॥)
చెప్పదు మనతో నించుక చెలి విరహపువెఱ్ఱిది యని
యెప్పటివలె నని చూడఁగ నింతే శాయ నయో
(॥చెప్పదు॥)
శిరసునఁ బువ్వులు ముడిచినఁ జెమరించెను మేనెల్లా
తరుణికి మరుబాణము లని తలఁచమైతిమవియు
విరులటు దులుపుచు గందము వెలఁదికి మెత్తితి మెఱుఁగక
తరువుల ననలం బుండే తాపము రేఁచె నయో
(॥చెప్పదు॥)
కపురపువీడెం బిచ్చిన కాఁకలు రేఁగెను కుచముల
తపియించెడు శశి విష మని తలఁచమైతి మయ్యో
నెపమునఁ బన్నీ రీకెకు నిండఁగఁ జల్లితి మెఱుఁగక
అపుడే నీళ్ళు చల్లన అద్రులు గరఁచు నయో
(॥చెప్పదు॥)
కలికికిఁ జిగురులు వరచినఁ గన్నులఁ గెంపులు గప్పెను
తలఁగక చిగురే చేగని తలఁచమైతి మదియూ
యెలమిని శ్రీవేంకటపతి యింతటనే చెలిఁ గూడెను
చలమున నిద్దరివయసులు సఫలం బాయ నయో
(||pallavi||)
sĕppadu manado niṁchuga sĕli virahabuvĕṭridi yani
yĕppaḍivalĕ nani sūḍam̐ga niṁte śhāya nayo
(||sĕppadu||)
śhirasunam̐ buvvulu muḍisinam̐ jĕmariṁchĕnu menĕllā
taruṇigi marubāṇamu lani talam̐samaidimaviyu
virulaḍu dulubusu gaṁdamu vĕlam̐digi mĕttidi mĕṟum̐gaga
taruvula nanalaṁ buṁḍe tābamu rem̐sĕ nayo
(||sĕppadu||)
kaburabuvīḍĕṁ bichchina kām̐kalu rem̐gĕnu kusamula
tabiyiṁchĕḍu śhaśhi viṣha mani talam̐samaidi mayyo
nĕbamunam̐ bannī rīgĕgu niṁḍam̐gam̐ jallidi mĕṟum̐gaga
abuḍe nīḽḽu sallana adrulu garam̐su nayo
(||sĕppadu||)
kaligikim̐ jigurulu varasinam̐ gannulam̐ gĕṁpulu gappĕnu
talam̐gaga sigure segani talam̐samaidi madiyū
yĕlamini śhrīveṁkaḍabadi yiṁtaḍane sĕlim̐ gūḍĕnu
salamuna niddarivayasulu saphalaṁ bāya nayo