Seppabode yee marmamu siggu mumcheeni

చెప్పబోతే యీ మర్మము సిగ్గు ముంచీని
Language

(॥పల్లవి॥)
చెప్పబోతే యీ మర్మము సిగ్గు ముంచీని
పిప్పి దొరలె నీవల్ల ప్రియురాండ్ల కెల్ల

(॥చెప్ప॥)
మంచిమాట లాడుతానే మనసు చొక్కించి నీచే
లంచము గొనెఁగా మోవి లలన
యెంచ నేమున్నది ఇఁక యెంగిలిసేసె నిన్ను
కంచము పొత్తు గలసె(పె) కాంతలకు నెల్లను

(॥చెప్ప॥)
కన్నులను నవ్వుతానే గందము వూసిన మేన
చన్నుల ముద్ర లొత్తెఁగా సకియ
వున్నవెల్లాఁ జెప్పనేల వొకతెతో భోగించి
కన్నెలకెల్లా వడ్డించె కడమదొడమలు

(॥చెప్ప॥)
సంగడిఁ గూచుండుతానే చక్కఁబెట్టుకొనె నిన్ను
రంగుగ శ్రీ వేంకటేశ రమణి
పొంగేటి జవ్వనమునఁ బొదిపి నిన్ను గూడి
ముంగిట మమ్మగూడించె ముదితలనెల్లను

(||pallavi||)
sĕppabode yī marmamu siggu muṁchīni
pippi dŏralĕ nīvalla priyurāṁḍla kĕlla

(||sĕppa||)
maṁchimāḍa lāḍudāne manasu sŏkkiṁchi nīse
laṁchamu gŏnĕm̐gā movi lalana
yĕṁcha nemunnadi im̐ka yĕṁgilisesĕ ninnu
kaṁchamu pŏttu galasĕ(pĕ) kāṁtalagu nĕllanu

(||sĕppa||)
kannulanu navvudāne gaṁdamu vūsina mena
sannula mudra lŏttĕm̐gā sagiya
vunnavĕllām̐ jĕppanela vŏgadĕdo bhogiṁchi
kannĕlagĕllā vaḍḍiṁchĕ kaḍamadŏḍamalu

(||sĕppa||)
saṁgaḍim̐ gūsuṁḍudāne sakkam̐bĕṭṭugŏnĕ ninnu
raṁguga śhrī veṁkaḍeśha ramaṇi
pŏṁgeḍi javvanamunam̐ bŏdibi ninnu gūḍi
muṁgiḍa mammagūḍiṁchĕ mudidalanĕllanu