Seppa veṟadumu neegu seri saaresaaregunu

చెప్ప వెఱతుము నీకు చేరి సారెసారెకును
Language

(॥పల్లవి॥)
చెప్ప వెఱతుము నీకు చేరి సారెసారెకును
యిప్పు డిట్టె రారాదా యిది యేమే నీవు

(॥॥)
వంచిన శిరసుతోడ వలఁపు చింతల నీడ-
నంచల నీపతి వున్నాఁడదె కదవే
మించినచెమట గార మీఁటుకొనీ గొనగోర-
నించుకంతా దయసేయ విదియేమే నీవు

(॥॥)
నిట్టూరుపు మోఁతలును నేలపై వాఁతలును
వొట్టుక నీపతి లోన నున్నాఁడదె
అట్టె కఁబాన నొరగె ఆయములు లోఁ గరఁగె
యెట్టని మాఁటాడవైతి విది యేమే నీవు

(॥॥)
నిండినకోరిక వెంచి నెరిఁ బులకలు ముంచి
అండకే శ్రీ వేంకటేశుఁ డదె నీపతి
పండినకెమ్మోవితోడ పైకొని నిన్నిటు గూడె
యెడ నీడ కన్నెఱఁగ విది యేమే నీవు

(||pallavi||)
sĕppa vĕṟadumu nīgu seri sārĕsārĕgunu
yippu ḍiṭṭĕ rārādā yidi yeme nīvu

(||||)
vaṁchina śhirasudoḍa valam̐pu siṁtala nīḍa-
naṁchala nībadi vunnām̐ḍadĕ kadave
miṁchinasĕmaḍa gāra mīm̐ṭugŏnī gŏnagora-
niṁchugaṁtā dayaseya vidiyeme nīvu

(||||)
niṭṭūrubu mom̐talunu nelabai vām̐talunu
vŏṭṭuga nībadi lona nunnām̐ḍadĕ
aṭṭĕ kam̐bāna nŏragĕ āyamulu lom̐ garam̐gĕ
yĕṭṭani mām̐ṭāḍavaidi vidi yeme nīvu

(||||)
niṁḍinagoriga vĕṁchi nĕrim̐ bulagalu muṁchi
aṁḍage śhrī veṁkaḍeśhum̐ ḍadĕ nībadi
paṁḍinagĕmmovidoḍa paigŏni ninniḍu gūḍĕ
yĕḍa nīḍa kannĕṟam̐ga vidi yeme nīvu