Seppa ne munnavi nee sesedi semtalu

చెప్ప నే మున్నవి నీ సేసెటి చేఁతలు
Language

(॥పల్లవి॥)
చెప్ప నే మున్నవి నీ సేసెటి చేఁతలు
అప్పటి కప్పటివేళ అను వింతే కాకా

(॥చెప్ప॥)
చేరి మొక్కఁగా నీవు సెలవి నవ్వేవు గాక
వూరకుండవా నీయంత నొగి నిందాఁకా
యేరీ తని యాడ వచ్చు నిటువంటి నీ చిత్తము
వారికి వారికి భాగ్యవశ మింతే కాకా

(॥చెప్ప॥)
చెనకఁగా నీ వంతలో చిమ్మి రేఁగే వింతే కాక
తనిసి గుట్టున నుంటేఁ దడవేవా
ఘన మైన నీ మహిమ కానఁగ నెట్ల వచ్చు
గొనకొన్న నీ యిచ్చకొలఁదే కాకా

(॥చెప్ప॥)
బలిమి గూడఁగా నీవు పైకొంటి విపుడె కాక
తెలుసుకొంద మ నెంటే తేటపడేవా
నెల వై శ్రీవెంకటేశ నిచ్చళించ నెట్టు వచ్చు
కులికెటి నీ వలపు కొలఁదే కాకా

(||pallavi||)
sĕppa ne munnavi nī sesĕḍi sem̐talu
appaḍi kappaḍiveḽa anu viṁte kāgā

(||sĕppa||)
seri mŏkkam̐gā nīvu sĕlavi navvevu gāga
vūraguṁḍavā nīyaṁta nŏgi niṁdām̐kā
yerī tani yāḍa vachchu niḍuvaṁṭi nī sittamu
vārigi vārigi bhāgyavaśha miṁte kāgā

(||sĕppa||)
sĕnagam̐gā nī vaṁtalo simmi rem̐ge viṁte kāga
tanisi guṭṭuna nuṁṭem̐ daḍavevā
ghana maina nī mahima kānam̐ga nĕṭla vachchu
gŏnagŏnna nī yichchagŏlam̐de kāgā

(||sĕppa||)
balimi gūḍam̐gā nīvu paigŏṁṭi vibuḍĕ kāga
tĕlusugŏṁda ma nĕṁṭe teḍabaḍevā
nĕla vai śhrīvĕṁkaḍeśha nichchaḽiṁcha nĕṭṭu vachchu
kuligĕḍi nī valabu kŏlam̐de kāgā