Sennalara bhoobadiseruvugaada nunnaamdu

చెన్నలర భూపతిచెరువుకాడ నున్నాఁడు
Language

(॥పల్లవి॥)
చెన్నలర భూపతిచెరువుకాడ నున్నాఁడు
వెన్నెలబాయిట నాడీ వేంకటేశుఁడు

(॥చెప్ప॥)
వాడలవాడలవెంట వనితలపొందు చేసీ
వేడుకకాఁడుగదమ్మ వేంకటేశుఁడు
జాడలు మీరి యప్పటి జాణతనాలాడీని
వీడెపుమోవితోడ వేంకటేశుఁడు

(॥చెప్పు॥)
సాదువలె నందరిచన్నులపైఁ జేయిచాఁచీ
వీదరవెల్లితనాల వేంకటేశుఁడు
ఆదిగొని గొల్లెతల నాసలఁబెట్టీఁ దాను
వేదవేద్యుఁడైనట్టి వేంకటేశుఁడు

(॥చెప్పు॥)
ననుపైనసతులెల్ల నంటునఁ గానుకియ్యఁగా
వినయాలు చేకొనీ వేంకటేశుఁడు
యెనసి నన్నునేలి యిప్పుడ నావిన్నపాలు
విన నవధరించె శ్రీవేంకటేశుఁడు

(||pallavi||)
sĕnnalara bhūbadisĕruvugāḍa nunnām̐ḍu
vĕnnĕlabāyiḍa nāḍī veṁkaḍeśhum̐ḍu

(||sĕppa||)
vāḍalavāḍalavĕṁṭa vanidalabŏṁdu sesī
veḍugagām̐ḍugadamma veṁkaḍeśhum̐ḍu
jāḍalu mīri yappaḍi jāṇadanālāḍīni
vīḍĕbumovidoḍa veṁkaḍeśhum̐ḍu

(||sĕppu||)
sāduvalĕ naṁdarisannulabaim̐ jeyisām̐sī
vīdaravĕllidanāla veṁkaḍeśhum̐ḍu
ādigŏni gŏllĕdala nāsalam̐bĕṭṭīm̐ dānu
vedavedyum̐ḍainaṭṭi veṁkaḍeśhum̐ḍu

(||sĕppu||)
nanubainasadulĕlla naṁṭunam̐ gānugiyyam̐gā
vinayālu segŏnī veṁkaḍeśhum̐ḍu
yĕnasi nannuneli yippuḍa nāvinnabālu
vina navadhariṁchĕ śhrīveṁkaḍeśhum̐ḍu