Senagusu neeve rattu sesugomtivi

చెనకుచు నీవే రట్టు సేసుకొంటివి
Language

(॥పల్లవి॥)
చెనకుచు నీవే రట్టు సేసుకొంటివి
వనితలందరు నా వంటివారే కారా

(॥చెన॥)
కూరిమి గొసరుతాను గుణము చూపితిగాక
కోరి నిన్ను నింతసేయ కోపమా నీతో
ఆ రీతి నందరితోడ ఆ మాటేల చెప్పితివి
యేరా నీయింతులకెల్లా యెత్తిచ్చుట గాదా

(॥చెన॥)
నిక్కము విభుఁడవంటా నేరుపు చెప్పితిఁగాక
వెక్కసము లాడ నాకు వెంగెమా నీతో
చక్కగ నీ కొలువులో సాకిరులేల పెట్టేవు
యిక్కువ విన్నవారెల్ల నిదె పావసేయరా

(॥చెన॥)
రతివేళ గాగ నిన్ను రాశి కెక్కించితిఁగాక
పతికిఁ బతిసేయఁగ పంతమా నీతో
యితవై శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
యితర సతులు నిన్ను యిందులకే మెచ్చరా

(||pallavi||)
sĕnagusu nīve raṭṭu sesugŏṁṭivi
vanidalaṁdaru nā vaṁṭivāre kārā

(||sĕna||)
kūrimi gŏsarudānu guṇamu sūbidigāga
kori ninnu niṁtaseya kobamā nīdo
ā rīdi naṁdaridoḍa ā māḍela sĕppidivi
yerā nīyiṁtulagĕllā yĕttichchuḍa gādā

(||sĕna||)
nikkamu vibhum̐ḍavaṁṭā nerubu sĕppidim̐gāga
vĕkkasamu lāḍa nāgu vĕṁgĕmā nīdo
sakkaga nī kŏluvulo sāgirulela pĕṭṭevu
yikkuva vinnavārĕlla nidĕ pāvaseyarā

(||sĕna||)
radiveḽa gāga ninnu rāśhi kĕkkiṁchidim̐gāga
padigim̐ badiseyam̐ga paṁtamā nīdo
yidavai śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
yidara sadulu ninnu yiṁdulage mĕchcharā